పోకిరి 3 ని సెట్‌ చేస్తున్న సరిలేరు దర్శకుడు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పూరి జగన్నాద్‌ ల కాంబినేషన్‌లో వచ్చిన మొదటి మూవీ పోకిరి. తెలుగు సినిమా ఉన్నంత కాలం పోకిరి సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు.ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు.ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి తెలుగు సినిమా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన పోకిరి సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో బిజినెస్‌మెన్‌ వచ్చింది.

 Mahesh Babu And Puri Jaganadh Movie Coming Soon Under Anil Sunkara Production-TeluguStop.com

ఆ సినిమా యావరేజ్‌గా నిలిచింది.వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండవ సినిమా బిజినెస్‌మెన్‌ కూడా ఒక మోస్తరుగా ఆకట్టుకుని విభిన్నమైన సినిమాగా నిలిచింది.ఇక గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరి కాంబోలో మూడవ సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి.కాని మహేష్‌ బాబు అందుకు సిద్దంగా లేడు అంటూ ఆమద్య పూరి స్వయంగా చెప్పడం చర్చనీయాంశం అయ్యింది.

మహేష్‌తో జనగనమణ సినిమాను చేయాలని పూరి ఆశ పడుతున్నాడు.

 Mahesh Babu And Puri Jaganadh Movie Coming Soon Under Anil Sunkara Production-పోకిరి 3 ని సెట్‌ చేస్తున్న సరిలేరు దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిద్దరి కాంబోకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ప్రముఖ నిర్మత అయిన అనీల్‌ సుంకర ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

మహేష్‌బాబుతో అనీల్‌ సుంకరమకు మంచి సన్నిహిత సంబందాలు ఉన్నాయి.సరిలేరు నీకెవ్వరు సినిమాను అనీల్‌ సుంకర నిర్మించాడు.ప్రస్తుతం మహేష్‌ చేయబోతున్న సర్కారు వారి పాట సినిమా నిర్మాణంలో కూడా అనీల్‌ సుంకర భాగస్వామిగా ఉండబోతున్నాడు.ఇప్పుడు మరో సినిమాను కూడా మహేష్‌ బాబుతో నిర్మించేందుకు అనీల్‌ డేట్లు తీసుకున్నాడు.

ఆ సినిమాను పూరితో డైరెక్ట్‌ చేయించాలని కూడా ఆయన భావిస్తున్నాడట.మొత్తానికి మహేష్‌ బాబు పూరిల కాంబో మూవీని అనీల్‌ సుంకర వచ్చే ఏడాది పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే అది మరో పోకిరిగా నిలవడం ఖాయం అంటూ ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు.ఈ సినిమా విషయమై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

#Pokiri #Mahesh Babu #Puri Jagannadh #Business Man #MaheshBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు