కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో మహేష్ బాబు సినిమా అంటూ మొదట వార్తలు వచ్చాయి.నమ్రత మరియు ప్రశాంత్ నీల్ ల చర్చల గురించి కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.
మహేష్ బాబు కోసం ప్రశాంత్ నీల్ కథ ను సిద్దం చేశాడనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.కాని సినిమా వర్కౌట్ అవ్వలేదు.
మహేష్ బాబు తో కంటే ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్ మూవీ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న విషయం తెల్సిందే.మరో వైపు సలార్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది.
కేజీఎఫ్ 2 విడుదల కాకుండానే ప్రశాంత్ నీల్ రెండు సినిమా లు లైన్ లో పెట్టాడు.సలార్ సినిమా షూటింగ్ సగం కు పైగా పూర్తి అయ్యింది.
కనుక మహేష్ బాబుతో సినిమా ఇప్పట్లో లేనట్లే అని తేలిపోయింది.

ఇటీవల మహేష్ బాబు కాంపౌండ్ నుండి క్లారిటీ వచ్చేసింది.గతంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా అంటూ వార్తలు వచ్చాయి.కదా ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అంటూ ప్రశ్నించగా గతంలో చర్చలు జరిగిన మాట వాస్తవమే.
కాని ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్ ప్రపోజల్ ఏమీ లేదన్నారు.ప్రస్తుతానికి ఆ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు అంటూ స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు.
మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అన్నారు.మహేష్ బాబు ఇప్పటి వరకు సర్కారు వారి పాట మరియు త్రివిక్రమ్ మూవీ మినహా మరే సినిమా ను ఆయన అధికారికంగా ప్రకటించలేదు.
రాజమౌళి తో ఒక సినిమా ఉంటుంది.అది వచ్చే ఏడాది చివరి వరకు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.
కనుక ప్రశాంత్ నీల్ మూవీ ఇప్పట్లో లేనట్లే అని స్పష్టత వచ్చేసింది.