సర్కారు వారి పాట మళ్లీ కన్ఫర్మ్‌.. ఇక ప్రభాస్ పైనే అందరి దృష్టి

Mahesh Babu And Pawan Kalyan Movies Are Coming For Sankranthi

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా విడుదల విషయంలో ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి.సంక్రాంతికి సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించినా కూడా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌ సంక్రాంతికి ముందు రాబోతుంది.

 Mahesh Babu And Pawan Kalyan Movies Are Coming For Sankranthi-TeluguStop.com

కనుక మరీ తక్కువ గ్యాప్‌ లోనే సర్కారు వారి పాట విడుదల చేయడం వల్ల ఖచ్చితంగా డ్యామేజీ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.అందుకే సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయక పోవడం మంచిది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాని అనూహ్యంగా సర్కారు వారి పాట సినిమా ను సంక్రాంతికే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా మరోసారి స్పష్టతను ఇచ్చారు.సంక్రాంతికి సినిమా విడుదల ఉంటుందని నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజున క్లారిటీ ఇవ్వడం జరిగింది.

 Mahesh Babu And Pawan Kalyan Movies Are Coming For Sankranthi-సర్కారు వారి పాట మళ్లీ కన్ఫర్మ్‌.. ఇక ప్రభాస్ పైనే అందరి దృష్టి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భీమ్లా నాయక్ కూడా సంక్రాంతికే విడుదల అవ్వడం కన్ఫర్మ అంటూ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.ఈ సమయంలో రాధే శ్యామ్ పరిస్థితి ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే రాధే శ్యామ్‌ కూడా సంక్రాంతికే అంటున్నారు.ఇప్పటికే ఆ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది.సంక్రాంతికి కనుక రాధే శ్యామ్‌ మరియు ఆ రెండు సినిమాలు వస్తే ఆర్ ఆర్‌ ఆర్‌ తో పోటీ పడటంతో పాటు ఒకరిని ఒకరు ఢీ కొట్టుకోవడం వల్ల చాలా డ్యామేజీ జరుగుతుంది.ఆ విషయంలో ఇంకా స్పష్టత రావడానికి ఒకటి రెండు నెలల సమయం పడుతుందని అంటున్నారు.

రాధే శ్యామ్‌ విడుదల కాకుంటేనే బెటర్ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు భీమ్లా నాయక్‌ ఇంకా సర్కారు వారి పాట సినిమాలు అలా అలా సంక్రాంతిని కుమ్మేస్తాయి.

ఇప్పటికే పోటీ ఎక్కువ ఉంది.ఇంకా పోటీ అన్నట్లుగా రాధే శ్యామ్‌ విడుదల అయితే ఖచ్చితంగా నాలుగు సినిమాల కు కూడా డ్యామేజీ తప్పదు అంటున్నారు.

#Sankranthi #Radeshyam #Mahesh Babu #Rrr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube