కూతురుకు స్పెషల్ విషెష్ చెప్పిన మహేష్ దంపతులు !

మహేష్ బాబు దంపతులు తన గారాల చిట్టి తల్లి సితార కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ రోజు సితార తన 9 వ పుట్టిన రోజును జరుపు కుంటుంది.

 Mahesh Babu And Namrata Special Wishes To Daughter Sithara-TeluguStop.com

ఈ సందర్భంగా మహేష్ బాబు, నమ్రత కూతురుకు స్పెషల్ విషెష్ తెలిపారు.మహేష్ బాబు అభిమానులు కూడా పెద్ద ఎత్తున సీతారాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

నమ్రత సోషల్ మీడియాలో సితార పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ పెడుతూ.చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు సితార అరుదైన ఫోటోలను కలిపి ఒక వీడియో చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 Mahesh Babu And Namrata Special Wishes To Daughter Sithara-కూతురుకు స్పెషల్ విషెష్ చెప్పిన మహేష్ దంపతులు -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాదు నువ్వు ఎదుగుతుంటే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్న.అంటూ నమ్రత షేర్ చేసుకుంది.అలాగే మహేష్ బాబు కూడా సితార పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాద్వారా విషెష్ తెలిపాడు.

నా బంగారు చిట్టి తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు కొత్త వెలుగులను నాకు పంచుతావు.నువ్వు అనుకుంటున్న దాని కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్న.

హ్యాపీ 9.అంటూ మహేష్ బాబు విషెష్ తెలిపాడు.దీనిపై సూపర్ స్టార్ అభిమానులు కూడా స్పందిస్తూ సితార కు పుట్టిన రోజు విషెష్ తెలుపుతున్నారు.

ఇది ఇలా ఉంటె ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు.కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా జరుగుతుంది.

ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది.మహేష్ ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా ప్రకటించాడు.

సర్కారు సినిమా పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టనున్నాడు.

#Keerthi Suresh #Mahesh Babu #MaheshBabu #HBD Sitara #Special Wishes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు