బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్ బాబు.! ఏ పాత్రలోనో తెలుసా?       2018-06-27   23:53:09  IST  Raghu V

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడి మార్పు కారణంగా ఆలస్యమైన ఈప్రాజెక్ట్‌ను వచ్చే నెలలో సెట్స్‌మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో నటీనటుల ఎపింక కూడా జరుగుతోంది.

ఇప్పటికే కీలక పాత్రలకు పలువురిని ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ స్వయంగా తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో కీలక పాత్ర నాదెండ్ల భాస్కరరావు పాత్రలో శరత్‌ కేడ్కర్‌ను ఫైనల్ చేశారు.

అన్ని పాత్రలు స్థాయికి తగ్గట్లుగా ఉండాలని బాలయ్య భావిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్ బాబు నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ మహేష్ ని సంప్రదించగా ఒకే చెప్పాడని కూడా సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావలసి ఉంది. ఏఎన్నార్ పాత్రకు నాగచైతన్యని ఒప్పించే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య ఇప్పటికే తన తాతయ్య పాత్రలో మహానటి చిత్రంలో మెరిశాడు.ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటించేందుకు చైతూ, మహేష్‌లు అంగీకరిస్తారో లేదో చూడాలి.