కెవి ఆనంద్ దర్శకత్వంలో సినిమా మిస్ అయిన మహేష్ బాబు

రంగం, బ్రదర్స్ సినిమాలతో సౌత్ లో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు కెవి ఆనంద్. కమర్షియల్ జోనర్ లోనే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కథలని చెప్పడం కెవి ఆనంద్ స్టైల్.

 Mahesh Babu And Kv Anand Movie Missed, Tollywood, Kollywood, Rangam Movie, Bando-TeluguStop.com

స్టిల్ కెమెరామెన్ గా కెరియర్ ప్రారంభించి తరువాత సినిమాటోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న కేవీ ఆనంద్ కన కండేన్ సినిమాతో దర్శకుడుగా టర్న్ తీసుకున్నాడు.ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది.

తెలుగులో కర్తవ్యం టైటిల్ తో రీమేక్ అయ్యి ఆకట్టుకుంది.కెవి ఆనంద్ చివరిగా సూర్య, ఆర్య కాంబినేషన్ లో కప్పన్ సినిమా తీశాడు.

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.తెలుగులో బందోబస్త్ అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

తన ప్రతి సినిమా ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని చెప్పడం కెవి ఆనంద్ స్టైల్.అయితే తాజాగా అయన గుండెపోతూతో మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే కెవి ఆనంద్ దర్శకత్వంలో బ్రదర్ కంటే ముందుగా మహేష్ బాబు ఓ సినిమా చేయాల్సి ఉంది.మహేష్ బాబు కూడా అతని స్టొరీకి ఒకే చెప్పి సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు.

అదే సమయంలో మహేష్ ఆగడు సినిమా డిజాస్టర్ అయ్యింది.దీంతో వెంటనే ప్రయోగాత్మక స్టొరీ అంటే కష్టం అని ఆ సినిమాని మహేష్ బాబు హోల్డ్ లో పెట్టాడు.

దీంతో కెవి ఆనంద్ కోలీవుడ్ లో సూర్యకి కథ చెప్పి సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు .అదే బ్రదర్ మూవీ.ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకున్నా హీరో సూర్యతో పాటు దర్శకుడు కెవి ఆనంద్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ఆ తర్వాత ఈ దర్శకుడు తెలుగు హీరోలతో సినిమాలు చేయాలనే ప్లాన్ చేయలేదు.

అలాగే మహేష్ బాబు తరువాత మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ మూవీ చేసి దెబ్బ తినడంతో తమిళ్ దర్శకుల పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు.అలా కెవి ఆనంద్, మహేష్ బాబు సినిమా పట్టాలు ఎక్కకుండా ఆగిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube