'సర్కారు వారి పాట' మరో లీక్‌.. కన్నుల పండుగ ఖాయం

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరశు రామ్ దర్శకత్వం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమా పై అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

 Mahesh Babu And Keerthy Suresh Movie Sarkaru Vaari Pata On Location Still Detail-TeluguStop.com

ఎందుకంటే దర్శకుడు గీత గోవిందం సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడం.ఈ సినిమా షూటింగ్ మొదట దుబాయి లో జరిగింది.

ఆ తర్వాత హైదరాబాద్‌ లో చేశారు.ఇప్పుడు స్పెయిన్ లో చేస్తున్నారు.

స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమా ను షూట్‌ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.అదే సమయంలో సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్స్ స్టిల్స్ రెగ్యులర్ గా లీక్ అవుతూనే ఉన్నాయి.

ఇప్పటి వరకు సినిమా లో మహేష్ బాబు లుక్‌ కు సంబంధించిన పలు ఫొటోలు మరియు వీడియోలు లీక్ అయ్యాయి.తాజాగా మరోసారి ఈ సినిమా పాట చిత్రీకరణ లీక్ అయ్యింది.

మహేష్‌ బాబు మరియు కీర్తి సురేష్ ల పై రొమాంటిక్ సాంగ్‌ ను స్పెయిన్‌ లో చిత్రీకరిస్తున్నారు.ఇటీవలే ఆ పాట సెట్స్ నుండి మోడల్స్‌ మహేష్‌ బాబు చుట్టు చేరి ఆయన బుగ్గ గిల్లుతున్న ఫొటోలు బయటకు వచ్చి వైరల్‌ అయ్యాయి.

ఇప్పుడు మహేష్‌ బాబు మరియు కీర్తి సురేష్ ల ఫొటో వైరల్‌ అవుతోంది.ట్విట్టర్ లో సర్కారు వారి పాట హ్యాష్‌ ట్యాగ్‌ తో తెగ వైరల్‌ అవుతోంది.

Telugu Parashuram, Keerthy Suresh, Mahesh Babu, Sarkaaruvaari, Spain, Tollywood-

కీర్తి సురేష్‌ ను బ్యాక్ నుండి చూపిస్తూ మహేష్ బాబు డాన్స్ మూమెంట్‌ ను ఈ స్టిల్‌ లో క్యాప్చర్ చేయడం జరిగింది.కీర్తి సురేష్‌ ఈ సినిమా లో చాలా అందంగా కనిపించబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ఆమె లుక్ వచ్చేసింది.ఇక ఈ స్టిల్‌ లో ఆమె మరింత అందంగా కనిపిస్తుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.యాష్‌ కలర్‌ డిజైనర్‌ డ్రస్‌ లో కీర్తి సురేష్ మహేష్ బాబు తో వేసే స్టెప్పులు సినిమా కు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తాయేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube