మహేష్ బాబు.టాలీవుడ్ సూపర్ స్టార్.చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టాడు.రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.తొలి సినిమాతోనే నంది అవార్డును దక్కించుకున్నాడు.ఆ తర్వాత పలు రకాల సినిమాలను చేస్తూ టాప్ హీరోగా ఎదిగిపోయాడు.
కౌబాయ్, సైంటిఫిక్ ఫిక్షన్, సోషియో పాంటసీ, మెసేజ్ ఓరియంటెడ్, కామెడీ మహేష్ అన్ని సబ్జెక్ట్ లను టచ్ చేస్తూ ముందుకు సాగాడు.మహేష్ నటించిన సినిమాల ప్రత్యేకత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మురారి- సోషియో ఫాంటసి
మహేశ్ బాబు నటించిన నాలుగో మూవీ మురారి.సోనాలి బింద్రే హీరోయిన్ గా చేసింది.శాపం మూలంగా ఓ వంశం ఎలా దెబ్బ తిన్నదనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.అయితే హీరో సమయం వచ్చే సరికి ఆ శాపం నుంచి ఎలా తప్పించుకున్నాడు అనే కథతో ఈ సినిమా తెరకెక్కింది.జనాలను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా.
టక్కరి దొంగ- కౌబాయ్
టక్కరి దొంగ సినిమాతో తన తండ్రిని ఫాలో అయ్యాడు.ఈ సినిమాలో బిపాషా, లిసారే హీరోయిన్లుగా చేశారు.కానీ ఈ సినిమా యావరేజ్ గానే నడిచింది.
ఒక్కడు- స్పోర్ట్స్
కబడ్డి క్రీడాకారుడిగా మహేష్ ఈ సినిమాలో కనిపించాడు.భూమిక హీరోయిన్ గా చేయగా.ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషించాడు.ఈ మూవీ కోసం ఛార్మినార్ తో పాటు ఓల్డ్ సిటీ సెట్ వేశారు.
నిజం- డ్రామా, యాక్షన్
తండ్రిని చంపిన హంతకులను కడతేర్చేందుకు రెడీ అయిన తల్లికొడుకుల నేపథ్యంతో తెరకెక్కిన సినిమా నిజం.ఇందులో మహేష్ బాబుకు తల్లిగా పాతతరం నటి రామేశ్వరి నటించారు.
నాని- సైన్స్ ఫిక్షనల్
ఈ సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీలో మహేష్ తో పాటు అమీషా పటేల్ కలిసి నటించింది.ఒకప్పటి అందాల తార దేవయాని మహేష్ మదర్ గా చేసింది.
అర్జున్- సెంటిమెంటల్ మూవి
అన్నాచెల్లి మధ్య ప్రేమను ఈ సినిమా తెరకెక్కించారు.మహేష్ సోదరిగా కీర్తిరెడ్డి నటించింది.పాతతరం హీరోయిన్ సరిత ఇందులో విలన్ గా చేసింది.మహేష్ తో పాటు శ్రియ జోడి కట్టింది.
పోకిరి- యాక్షన్ మూవీ
మహేష్ బాబు కెరీర్ లో ఓ మైలురాయి ఈ సినిమా.ఇలియానా హీరోయిన్ గా చేసింది.
ఖలేజా- కామెడి
మహేష్ బాబులోని కామెడీ యాంగిల్ ను ఈ సినిమా బయటపెట్టింది.ఈ సినిమా మాత్రం విజయం సాధించలేదు.ఇందులో మహేష్ తో జంటగా అనుష్క నటించింది.
బిజినెస్ మ్యాన్- నెగటివ్ షేడ్స్
మహేష్ బాబు నెగటివ్ షేడ్స్ లో కనిపించిన సినిమా బబిజినెస్ మ్యాన్.కాజల్ హీరోయిన్.పూరీ దర్శకుడు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు- మల్టీ స్టారర్
వెంకటేష్ తో కలిసి మహేశ్ నటించిన మల్టీస్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.తెలుగులో మంచి విజయం సాధించింది.
1 నేనొక్కడినే- సైకలాజికల్ మూవీ
మేధస్సుకు సంబంధించిన అరుదైన వ్యాధితో మహేష్ బాధపడతాడు.తన అమ్మానాన్నలను చంపిన వారిని తను చంపాడా? లేదా? అనే కథాశంతో ఈ సినిమా తెరకెక్కింది.అయితే జనాలకు ఈ సినిమా అంతా ఎక్కదు.
శ్రీమంతుడు- మెసేజ్ ఓరియంటెడ్
పుట్టి పెరిగిన ఊరును బాగు చేసుకోవాలనే సందేశంతో ఈ సినిమా చేశాడు మహేష్ బాబు.
భరత్ అనే నేను- పొలిటికల్
చదువుకునే యువకుడు ఓ రాష్ట్రానికి సీఎం అయితే ఎలాంటి మార్పులు తెస్తాడో మహేష్ ఈ సినిమాలో చూపించాడు.
మహర్షి- రైతే రాజు
రైతును కాపాడుకోవడం మన బాధ్యత అని ఈ సినిమా ద్వారా చూపించాడు ప్రిన్స్.సినిమా తర్వాత చాలా మంది వీకెండ్ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు.