యూరప్ వీధుల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్.. పిక్స్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

 Mahesh Babu And Family In The Streets Of Europe Details, Mahesh Babu, Family, Europe, Sarkaru Vaari Paata, Trivikram, Mahesh Babu America Tour, Namratha, Goutam Ghattamaneni, Sithara, Director Rajamouli,pooja Hegde-TeluguStop.com

అలాగే కలెక్షన్స్ కూడా పోటీ లేకపోవడంతో దూసుకు పోతున్నాడు.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.

మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.

 Mahesh Babu And Family In The Streets Of Europe Details, Mahesh Babu, Family, Europe, Sarkaru Vaari Paata, Trivikram, Mahesh Babu America Tour, Namratha, Goutam Ghattamaneni, Sithara, Director Rajamouli,pooja Hegde-యూరప్ వీధుల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్.. పిక్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు మహేష్ సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే ప్రెసెంట్ మహేష్ అమెరికా వెళ్ళాడు.త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయడానికంటే ముందే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈయన ఫ్యామిలీతో కలిసి సర్కారు సక్సెస్ ఇచ్చిన హ్యాపీనెస్ తో వెకేషన్ కు వెళ్ళాడు.అక్కడ యూరప్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోల్లో మహేష్ తో పాటు ఆయన భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ ఉన్నారు.

ఇక ఆయన అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ తో చేసే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకుని సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు.మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ తో పాటు మంచి ఎమోషన్స్ కలగలిపి ఉండేలా త్రివిక్రమ్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను 2023 సంక్రాంతి లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.ఈ సినిమా తర్వాత మహేష్ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube