మహేష్ బాబును బాలయ్య ఆ ప్రాబ్లం నుంచి గట్టెక్కించాడు.. మీకు తెలుసా?

నాటితరం సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు నేటి తరం ప్రేక్షకులకు సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు.ఇక వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు.

 Mahesh Babu And Balakrishna Unknown Facts Details, Mahesh Babu, Nandamuri Balakr-TeluguStop.com

ఇక టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నాడు మహేష్ బాబు.అయితే మహేష్ బాబు రాజకుమారుడు అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక మొదటి సినిమానే మంచి విజయం సాధించింది.ఇక ఆ తర్వాత మురారి సినిమాతో మరోసారి మంచి బ్లాక్ బస్టర్ సాధించాడు.

 అయితే సినిమా హిట్లు అయితే సాధించాడు కానీ మాస్ ఫాలోయింగ్ సంపాదించడానికి చాలా రోజుల సమయం పట్టింది.

ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

దీంతో ఒక్కసారిగా మహేష్ కు మాస్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా అయితే ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు అది నేనే అన్నట్లుగా ఇక ఇండస్ట్రీ రికార్డులను కూడా దిమ్మ తిరిగే విధంగా బద్దలు కొట్టేశాడు మహేష్ బాబు.ఇక తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి

అలాంటి మహేష్ బాబు ని నందమూరి బాలకృష్ణ ఒక సినిమా సమయంలో కష్టాలనుంచి గట్టెక్కించాడట.

Telugu Balakrishna, Bobby, Aarti Aggarwal, Mahesh Balayya, Mahesh Babu, Murari,

ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం… మహేష్ బాబు హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన చిత్రం బాబి.పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ డ్రైవర్ ఆర్తి అగర్వాల్ తో అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో కోపం పట్టలేకపోయిన మహేష్ అతనిపై చేయి చేసుకున్నాడు.దీంతో అప్పట్లో షూటింగ్లో పాల్గొంటున్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా షూటింగ్ ఆపేసి మహేష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారట.

Telugu Balakrishna, Bobby, Aarti Aggarwal, Mahesh Balayya, Mahesh Babu, Murari,

దీంతో షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.ఆ తర్వాత సినిమా ముందుకు వెళ్తుందో లేదో అని అందరూ కంగారు పడ్డారు.కాని విషయం తెలుసుకున్న బాలయ్య నేరుగా షూటింగ్ స్పాట్ కు వెళ్లి క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని… కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు.ఇక ఆ తర్వాత తప్పు ఎవరిదో తెలుసుకొని యధావిధిగా షూటింగ్లో పాల్గొన్నారు జూనియర్ ఆర్టిస్టులు.

ఇక పోతే ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అటు మహేష్ బాబు కూడా వచ్చాడు అన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube