మహేష్‌, బన్నీ కమర్షియల్‌ యాడ్స్ కు పెద్ద తేడా ఏంటో తెలుసా?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సౌత్‌ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక కమర్షియల్‌ యాడ్స్ లో నటించే హీరోగా రికార్డు దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు.ఆ రికార్డు ను ఏ హీరో కూడా ఇప్పట్లో బ్రేక్‌ చేయడం సాధ్యం అయ్యే పని కాదు.

 Mahesh Babu And Allu Arjun Acting Back To Back Commercial Ads , Ads, Alluarjun, Alluarjun Vs Mahesh Babu, Flim News, Mahesh Babu , News In Telugu-TeluguStop.com

మహేష్ బాబు ఎన్నో యాడ్స్ లో నటించి అత్యధిక కమర్షియల్స్ లో నటించిన సౌత్‌ హీరోగా నిలిచాడు.ఇప్పుడు మహేష్ బాబు దారిలోనే అల్లు అర్జున్ కూడా తనదైన శైలిలో బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్‌ యాడ్స్ కు ఓకే చెబుతూ వస్తున్నాడు.

యాడ్స్ లో నటించడం వల్ల ఒక్కో హీరో కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు.వీరిద్దరు కూడా కోట్ల రూపాయల పారితోషికాలు అందుకుంటున్నారు.

ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా పారితోషికంగా యాడ్స్ కు భారీ మొత్తంలో డబ్బును తీసుకోవడంతో పాటు కొన్ని సంస్థల్లో వాటాను కూడా తీసుకుంటున్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.ప్రస్తుతం వీరిద్దరి యాడ్స్ గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

అందేంటి అంటే అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో ఒప్పుకుంటున్న యాడ్స్ అన్నింటికి సంబంచి జాతీయ స్థాయి లో ఆయనే కనిపించబోతున్నాడు.అంటే ఒక యాడ్‌ ను తీసుకుంటే సౌత్‌ లో ఒకరు ఉత్తర భారతం లో ఒకరు ప్రమోట్స్ గా నటిస్తూ ఉంటారు.

కాని అల్లు అర్జున్‌ అలా కాదు.ఆయన నటిస్తున్న బ్రాండ్స్ కు సంబంధించిన వీడియోలు అన్ని భాషలకు కలిపి ఒక్కటే ఉంటుంది.హిందీలో కూడా ఈయన నటించిన యాడ్స్ నే టెలికాస్ట్‌ చేస్తున్నారు.కాని మహేష్ బాబు మాత్రం సౌత్‌ రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితం అని.కొన్ని కేవలం తెలుగు రాష్ట్రాల వరకు పరిమితం అంటున్నారు.ఈ విషయంలో అల్లు అర్జున్‌ అభిమానులు గొప్పలు చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తానికి ఇద్దరు హీరోలు కూడా యాడ్స్ విషయంలో తోపులే అనడంలో సందేహం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube