మహేష్‌ మరీ చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు     2018-06-12   23:14:21  IST  Raghu V

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది మహేష్‌బాబు పద్దతి అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సంవత్సరంలో దాదాపు 100 కోట్ల ఆదాయంను కలిగి ఉన్న సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు చేస్తున్న కొన్ని పనులు చిల్లర వ్యవహారంను తలపిస్తున్నాయి. శ్రీమంతుడు చిత్రంలో మాదిరిగా మహేష్‌బాబు నిజ జీవితంలో రెండు ఊర్లను దత్తత తీసుకున్నాడు. ఒకటి ఆంధ్రాలో కాగా రెండవది తెలంగాణలో. ఆ రెండు ఊర్లపై మహేష్‌బాబు ఇప్పటి వరకు సొంతంగా ఖర్చు చేసింది 50 లక్షల లోపే అంటూ సమాచారం అందుతుంది. రెండు ఊర్లలో వసతులు కల్పించేందుకు మహేష్‌బాబు దాతల వద్ద సాయంను అభ్యర్జిస్తున్నాడట.

తాను దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్దికి ఇప్పటి వరకు పలు సంఘాలతో మాట్లాడి సాయం చేయించిన మహేష్‌బాబు, పలు సందర్బాల్లో హెల్త్‌ క్యాంప్‌లు నిర్వహించారు. మహేష్‌బాబు ఆయా ఏరియాల్లో ఉన్న హాస్పిటల్స్‌ మరియు స్వచ్చంద సంస్థలతో మాట్లాడి సాయం చేయించాడు తప్ప, ఆయన చేతి నుండి పెడుతున్న దాఖలాు కనిపించడం లేదు. తాజాగా ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ నుండి మహేష్‌బాబు దత్తత గ్రామాలకు 25 లక్షల విరాళం అందింది. ఆ విరాళం కోసం స్వయంగా మహేష్‌బాబు భార్య నమ్రత సదరు సంస్థ ప్రతినిధులను కలిసినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి మహేష్‌బాబు చేస్తున్న సాయంపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.