మహేష్‌ మరీ చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది మహేష్‌బాబు పద్దతి అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సంవత్సరంలో దాదాపు 100 కోట్ల ఆదాయంను కలిగి ఉన్న సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు చేస్తున్న కొన్ని పనులు చిల్లర వ్యవహారంను తలపిస్తున్నాయి.

 Mahesh Babu Adopted Villages Development-TeluguStop.com

శ్రీమంతుడు చిత్రంలో మాదిరిగా మహేష్‌బాబు నిజ జీవితంలో రెండు ఊర్లను దత్తత తీసుకున్నాడు.ఒకటి ఆంధ్రాలో కాగా రెండవది తెలంగాణలో.

ఆ రెండు ఊర్లపై మహేష్‌బాబు ఇప్పటి వరకు సొంతంగా ఖర్చు చేసింది 50 లక్షల లోపే అంటూ సమాచారం అందుతుంది.రెండు ఊర్లలో వసతులు కల్పించేందుకు మహేష్‌బాబు దాతల వద్ద సాయంను అభ్యర్జిస్తున్నాడట.

తాను దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్దికి ఇప్పటి వరకు పలు సంఘాలతో మాట్లాడి సాయం చేయించిన మహేష్‌బాబు, పలు సందర్బాల్లో హెల్త్‌ క్యాంప్‌లు నిర్వహించారు.మహేష్‌బాబు ఆయా ఏరియాల్లో ఉన్న హాస్పిటల్స్‌ మరియు స్వచ్చంద సంస్థలతో మాట్లాడి సాయం చేయించాడు తప్ప, ఆయన చేతి నుండి పెడుతున్న దాఖలాు కనిపించడం లేదు.తాజాగా ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ నుండి మహేష్‌బాబు దత్తత గ్రామాలకు 25 లక్షల విరాళం అందింది.ఆ విరాళం కోసం స్వయంగా మహేష్‌బాబు భార్య నమ్రత సదరు సంస్థ ప్రతినిధులను కలిసినట్లుగా సమాచారం అందుతుంది.

మొత్తానికి మహేష్‌బాబు చేస్తున్న సాయంపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

సినిమా సక్సెస్‌ అయినా ఫ్లాప్‌ అయినా కూడా పాతిక కోట్లకు తగ్గకుండా పారితోషికంను తీసుకోవడంతో పాటు, లాభాల్లో వాటాలు మరియు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోట్లల్లో ఆదాయం ఉన్న మహేష్‌బాబు తన దత్తత గ్రామాల కోసం ఇప్పటి వరకు కనీసం కోటి రూపాయలు ఖర్చు చేయక పోవడంను కొందరు తప్పుబడుతున్నారు.

అలాంటప్పుడు మహేష్‌ పేరు కోసం ఆ గ్రామాలను దత్తత తీసుకున్నట్లుగా అనుకోవాల్సి వస్తుందని కొందరు అంటున్నారు.మహేష్‌బాబుపై చేస్తున్న ఆరోపణలకు ఆయన సన్నిహితుల నుండి కాని, ఆయన నుండి కాని ఎలాంటి స్పందన లేదు.

మహేష్‌బాబు తరపున నమ్రత దత్తత గ్రామాల్లో పలు సార్లు సందర్శించారు.ఎన్ని సార్లు సందర్శించినా కూడా ఆ గ్రామాల్లో ఉన్న ప్రాధమిక సమస్యల పరిష్కారం ఇప్పటి వరకు జరగలేదని చెప్పక తప్పదు.

గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి సాయం కోరడం లేదా, దాతల నుండి సాయం వస్తే అప్పుడు ఇవ్వాలని చూడటం మహేష్‌బాబు అండ్‌ కోకు ఏమాత్రం పద్దతి కాదు అంటూ ఆ గ్రామాల ప్రజలు అంటున్నారు.తాజాగా ఒక మీడియా సంస్థ తెలంగాణలో మహేష్‌బాబు దత్తత తీసుకున్న గ్రామంకు వెళ్లారు.

అక్కడ ప్రజలు మహేష్‌ దత్తత తీసుకున్నంత మాత్రాన తమ గ్రామం పెద్దగా అభివృద్ది చెందినది ఏమీ లేదని, అసలు తాము కొన్ని సార్లు ఆ విషయాన్ని మర్చి పోతున్నామని వారు అంటున్నారు.ఇప్పటికైనా మహేష్‌బాబు కాస్త తన చేతి నుండి డబ్బులు జార్చి ఆయా గ్రామాలను అభివృద్ది చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube