డిజాస్ట‌ర్ మూవీతో సెన్షేష‌న‌ల్ రికార్డు క్రియేట్ చేసిన మ‌హేష్‌

యూట్యూబ్ వ‌చ్చాక సినిమాల ప‌రంగా ఎన్నో సంచ‌ల‌నాలు న‌మోదు అవుతున్నాయి.వెండితెర‌పై ఫ‌ట్ అయిన సినిమాలు బుల్లితెర‌పై హిట్ అవుతున్నాయి.

 Mahesh Babu Aagadu Movie Creates Sensational Record,mahesh Babu,bellam Konda,you-TeluguStop.com

వెండితెరపై ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌ని సినిమాలు యూట్యూబ్‌లో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.అంతెందుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్లాప్ సినిమాల‌ను హిందీలో డ‌బ్ చేసి యూట్యూబ్‌లో పెడితే ఏకంగా 300 మిలియ‌న్ల వ్యూస్ ( 3 కోట్లు ) సులువుగా వ‌స్తున్నాయి.

ఇక్క‌డ మ‌న మీడియం రేంజ్ హీరోల యాక్ష‌న్ సినిమాలు నార్త్ మాస్ ప్రేక్ష‌కుల‌ను పిచ్చ పిచ్చ‌గా ఫిదా చేస్తున్నాయి.దీంతో యూట్యూబ్‌లో వాటికి మిలియ‌న్ల కొద్ది వ్యూస్ వ‌స్తున్నాయి.

ఇక మ‌న హీరోల డిజాస్ట‌ర్ సినిమాలు కూడా యూట్యూబ్‌లో దుమ్ము రేపే వ్యూస్ తెచ్చుకుంటున్నాయి.తాజాగా మ‌హేష్‌బాబు డిజాస్ట‌ర్ మూవీ ఆగ‌డు యూట్యూబ్‌లో ఏకంగా 500 మిలియ‌న్ల వ్యూస్ ( 5 కోట్లు) తెచ్చుకుని మైండ్ బ్లాక్ చేసింది.

ఆగ‌డు హిందీ వెర్ష‌న్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.దీంతో అన్ని వెర్ష‌న్లు కూడా క‌లుపుకుంటే ఆగ‌డుకు 500 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.14 రీల్స్ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టేసింది.శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌న్ సినిమా త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చినా ప్లాప్ అయ్యింది.

అప్ప‌టికే శ్రీను వైట్ల – మ‌హేష్ కాంబోలో వ‌చ్చిన దూకుడు హిట్ అవ్వ‌డంతో ఆగ‌డుపై భారీ అంచ‌నాలు ఉన్నా కూడా ప్లాప్ అయ్యింది.మ‌హేష్‌బాబు, త‌మ‌న్నా జంట‌గా న‌టించ‌డం, శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం కావ‌డంతో రిలీజ్‌కు ముందు తిరుగులేని హైప్ వ‌చ్చింది.

అయితే నాసిర‌కం క‌థ‌, క‌థ‌నాలు సినిమాను ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ చేయ‌లేక‌పోయాయి.ఇప్పుడు యూట్యూబ్‌ను మాత్రం షేక్ చేసే రేంజ్‌లో వ్యూస్ వ‌స్తున్నాయి.ఆ మాట‌కు వ‌స్తే ఆగ‌డు, ఖ‌లేజా సినిమాలు వెండితెర‌పై అంచ‌నాలు అందుకోలేక‌పోయినా బుల్లితెర‌పై రికార్డు టీఆర్పీలు రాబ‌ట్టాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube