మహేష్‌ 26 టైటిల్‌ అదే... ఫ్యాన్స్‌కు పూనకాలే  

Mahesh Babu 26 Movie Updates-mahesh Updates,mb26 Movie,అనిల్ రావిపూడి,మహర్షి,మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25వ చిత్రంగా మహర్షి వచ్చింది. భారీ విజయాన్ని సాధించే దిశగా మహర్షి దూసుకు పోతుంది. రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్నాయి. 100 కోట్ల షేర్‌ను మహర్షి రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మహేష్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ మూవీగా మహర్షి నిలవబోతుంది..

మహేష్‌ 26 టైటిల్‌ అదే... ఫ్యాన్స్‌కు పూనకాలే -Mahesh Babu 26 Movie Updates

ఇలాంటి సమయంలో మహేష్‌ బాబు 26వ చిత్రం గురించి చాలా ఆసక్తి నెలకొంది. పెద్ద ఎత్తున మహేష్‌ బాబు అభిమానులు ఆయన తర్వాత సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే మహేష్‌ బాబు 26వ చిత్రంకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నట్లుగా తేలిపోయింది.

అనీల్‌ రావిపూడి ఎఫ్‌ 2 చిత్రంతో దుమ్ము రేపాడు. అంతకు ముందు సినిమాలు కూడా ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలుగా నిలిచాయి. అందుకే మహేష్‌ బాబు ఈసారి కామెడీతో అభిమానులను మెప్పించాలనే ఉద్దేశ్యంతో అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాడు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన విషయాలు మీడియాకు లీక్‌ అయ్యాయి.

అనీల్‌ రావిపూడి ఈ చిత్రం కు ‘రెడ్డి గారి అల్లుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడట. మొదట వాట్సప్‌ అనే టైటిల్‌ను అనుకున్నప్పటికి మహేష్‌ బాబు ఇమేజ్‌కు అది సెట్‌ అవ్వదనే ఉద్దేశ్యంతో రెడ్డి గారి అల్లుడు అనే టైటిల్‌ కు ఖరారు అయ్యారట. ఈ చిత్రంలో మహేష్‌ బాబు కొత్త యాంగిల్‌ చూస్తారని మస్త్‌గా నవ్వించేలా ఆయన పాత్ర ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతుంది.

ఆమె రెండు కోట్ల పారితోషికంను తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక రమ్యకృష్ణ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడి కానున్నాయి.