నవ్వులు పంచేందుకు 13 రోజులు అంటోన్న మహేష్  

Mahesh Babu 13 Days Call Sheet For F3 - Telugu Anil Ravipudi, F2, F3, Mahesh Babu, Telugu Movie News, Varun Tej, Venkatsh

గతేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్2 బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో వెంకీ మళ్లీ అదిరిపోయే ఫాంలోకి రావడమే కాకుండా అదిరిపోయే కలెక్షన్లు కూడా రాబట్టాడు.

Mahesh Babu 13 Days Call Sheet For F3 - Telugu Anil Ravipudi F2 Movie News Varun Tej Venkatsh

ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్ కలిసి చేసిన కామెడీకి జనాలు కడుపుబ్బా నవ్వారు.అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి అప్పుడే అనౌన్స్ చేశాడు.

ఇక రీసెంట్‌గా సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు ఎఫ్3 సినిమాపై ఫోకస్ పెట్టాడు.ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు మరో స్టార్ హీరోను పెట్టేందుకు అనిల్ ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ఇటీవల ఈ సినిమాలో మాస్‌రాజా రవితేజ నటిస్తాడని వార్తలు వచ్చినా, దానిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వలేదు.కాగా ప్రస్తుతం ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తాడనే వార్త జోరందుకుంది.

ఇక ఈ సినిమాలో నటించేందుకు మహేష్ 13 రోజుల కాల్ షీట్స్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది.ఈ 13 రోజుల్లోనే వెంకీ, వరుణ్ తేజ్‌లతో కలిసి ప్రేక్షకులను నవ్వించడం ఖాయమని మహేష్ అంటున్నాడట.

అనిల్ రావిపూడి ఈ సినిమాకు అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది.మరి ఈ 13 రోజుల కాల్‌షీట్లలో మహేష్ ఎంతమేర నవ్విస్తాడా అనే ప్రశ్న ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా వార్తలు