పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సూపర్ స్టార్ మహేష్ .చిరంజీవి తరువాత ఎవరంటే వీరే.
సినిమాకి టాక్ వస్తే చాలు, డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటారు.రాత్రికి రాత్రే వారి అదృష్టరేఖలు మారిపోతాయి.
అదే వీరికి ఫ్లాప్ పడితే బతుకు బస్టాండే.సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం చిత్రాలు ఈ మాటకు సాక్ష్యం.
ఏడాది గడిచినా, సర్దార్ పంపిణీదారులు ఇంకా తమ నష్టాల నొప్పిని భరిస్తూ రోడ్డు మీద తిరుగుతున్నారు.తమకి నష్టపరిహారం చెల్లించాలని, న్యాయం కావాలని అర్థిస్తున్నారు.
ఇక బ్రహ్మోత్సవం నష్టాలు మహేష్ జేబుకి చిల్లు పడేలా చేసాయి.నష్టపరిహారం చెల్లించక తప్పలేదు బాబు.
దీనికి కారణం కేవలం సినిమాలు బాగుండకపోవడమే కాదు.వీరి సినిమాలకు అవుతున్న బిజినెస్ కూడా.
పవన్ కళ్యాణ్ సొంత స్టోరి రాసుకుంటే బయ్యర్లు 80 కోట్ల పైగా పెట్టారు, మహేష్ ఏదో సిరియల్ లాంటి ఫ్యామిలి సినిమా తీస్తే దానికి కూడా ఎనభై కోట్ల దాకా పెట్టారు.ఇంత పెట్టాక టాక్ తేడా కొడితే కష్టమే కదా.మొత్తానికి గత ఏడాది ఇద్దరు కలిసి దాదాపుగా 60-70 కోట్ల నష్టాల్ని తీసుకొచ్చారు.ఈ నష్టాలతో ఓ భారి బడ్జెట్ సినిమా తీసెయ్యొచ్చు.
ఈ ఏడాది మార్చిలో పవన్ వస్తుండగా, మహేష్ జూన్ లో వస్తున్నాడు.కాటమరాయుడు 82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, మహేష్ 23వ సినిమా కేవలం తెలుగులోనే 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్, తమిళం కలుపుకోని, 120 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసేలా ఉంది.
వీరి గత చిత్రాలు పీడకలలు తెప్పించినా, డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరి స్టార్ పవర్ ని మాత్రం నమ్ముకుంటున్నారు.ఈసారి కూడా ఇద్దరు డిజాస్టర్లు ఇస్తే, ఈసారి నష్టాల లెక్క 100 కోట్ల దాకా పోయిన పోవచ్చు.
ఇదే జరిగితే, ఈ ఇద్దరు సినిమాలు మానేయాలని రొడ్డుకెక్కుతారు పంపిణీదారులు.