మహేష్ 27 స్టోరీ లీక్.. ఏమిటో ఈ పుకార్లు!  

Mahesh 27 Story Leaked - Telugu Mahesh 27, Mahesh Babu, Parasuram, Telugu Movie News, Vamsi Paidipally

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు మహేష్.

Mahesh 27 Story Leaked

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని వంశీ పైడిపల్లితో చేస్తాడని అందరూ అనుకున్నారు.

కానీ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

మహేష్ 27 స్టోరీ లీక్.. ఏమిటో ఈ పుకార్లు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో వంశీతో సినిమాను మహేష్ పక్కనబెట్టాడని, తన నెక్ట్స్ మూవీని పరశురాంతో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమా దాదాపు ఖరారు అయ్యిందని, దీని కోసం పరశురాం అదిరిపోయే స్క్రిప్టును కూడా రెడీ చేశాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి.

వైట్ కాలర్ మోసాలను ఈ సినిమాలో ప్రధాన అంశంగా చూపిస్తారట.దేశానికి చెందిన బిజినెస్ టైకూన్స్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీల తరహా మోసాలను ఇందులో బట్టబయలు చేస్తారట.

ఈ మోసాల నుండి దేశాన్ని హీరో ఎలా కాపాడన్నది కథ అని తెలుస్తోంది.

మొత్తానికి ఈసారి కూడా ఓ సోషల్ మెసేజ్‌ను జనాలకు చూపించేందుకే మహేష్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ కాకముందే ఇలాంటి వార్తలు రావడం ఏమిటని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test