రానాకు ప్రేమతో విషెస్ చెప్పిన భార్య.. ఏం చెప్పారంటే..?

లీడర్ సినిమాలోని అర్జున్ పాత్రతో టాలీవుడ్ లో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు దగ్గుబాటి రానా.తొలి సినిమాలోనే ప్రయోగాత్మక పాత్రలో నటించిన రానా ఆ సినిమాతో ప్రశంసలు పొందినా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపొయారు.

 Miheeka Bajaj Wishes Rana Daggubati Completing 11 Years Tollywood, Miheeka Bajaj-TeluguStop.com

యంగ్ సీఎంగా రానా నటించిన లీడర్ 2010 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన విడుదలైంది.ఆ సినిమా విడుదలై నిన్నటితో 11 సంవత్సరాలు పూర్తైంది.

లీడర్ తరువాత రానా నేను నా రాక్షసి, నా ఇష్టం సినిమాల్లో నటించారు.రానా నటించిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

అయితే క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుమ్ రానాలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది.ఆ సినిమాలో బీటెక్ బాబు పాత్రతో రానా ప్రేక్షకులకు చేరువయ్యారు.

అయితే రానాకు నటుడిగా భారీ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమా మాత్రం బాహుబలి సిరీస్.

Telugu Bahubali, Bollywood, Miheeka Bajaj, Netizens, Rana, Wishes, Tollywood-Mov

బాహుబలి సిరీస్ లోని భల్లాలదేవ పాత్రలో అద్భుతంగా నటించిన రానా నటనను ప్రేక్షకులు తేలికగా మరిచిపోలేరు.ఆ తరువాత రుద్రమదేవి, ఘాజీ, నేనేరాజు నేనే మంత్రి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలలో రానా నటించారు.తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా రానా నటించి మెప్పించడం గమనార్హం.లీడర్ సినిమా విడుదలై 11 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో రానా భార్య మిహీకా రానాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

“హ్యాపీ 11 ఇయర్స్.మై డార్లింగ్ రానా” అంటూ మిహీకా బజాజ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.గతేడాది ఆగష్టు నెల 8వ తేదీన తక్కువ సంఖ్యలో బంధుమిత్రుల మధ్య రానా వివాహం జరిగింది.

ప్రస్తుతం రానా అరణ్య, విరాటపర్వం, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాల్లో నటిస్తుండగా ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube