గాంధీ కళ్లజోడు ధర ఎంత పలికిందో తెలుసా?

భార‌త జాతిపిత మహాత్మాగాంధీ కళ్ల జోడు ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ లో వేలానికి పెట్టిన సంగతి తెలిసిందే.సాధారణంగానే ఎంతోమంది పురాతనమైన వస్తువులను ఎన్నో కోట్లు పెట్టి కొంటుంటారు.

 Mahatma Gandhi, Spectacles, Worth Rs.2.5 Crore, India, Qatar, Usa, Russia, Canad-TeluguStop.com

అలాంటిది జాతిపిత మహాత్మ గాంధీ కళ్ళజోడు అంటే మాములు రేటు ఉంటుందా? ఎంతోమంది పోటీ పడి మరి రేటును పెంచేస్తారు.

ఈ నెల 10వ తేదీన ఈ కళ్ళజోడు వేలానికి పెట్టగా వీటి ధర భారీగా పలికాయి.ఇవి 2,60,000 యూరోల‌కు అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.2.5 కోట్లు పెట్టి కొన్నారు.అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఈ కళ్లజోడును దక్కించుకున్నాడు.

మొదట ఈ కళ్లజోడును 15,000 యూరోల ధరకే రిజర్వ్ చేసినట్టు ఆక్షనర్ ఆండీ స్టోవ్ తెలపగా ఆతర్వాత ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది ఈ కళ్లజోడును కొనేందుకు ఆసక్తి చూపించారు.దీంతో ఈ కళ్ళజోడు ధర అమాంతం పెరిగిపోయింది.

కాగా సౌతాఫ్రికాలో గాంధీజీ ఉన్నప్పుడు 1920లో బ్రిటిష్‌ పెట్రోలియంలో పని చేసే వ్యక్తికి ఈ కళ్లజోడును గాంధీ ఇచ్చినట్టు సంస్ద తెలిపింది.ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తికి వంశపారంపర్యంగా తనకు వచ్చిన ఈ కళ్లజోడును పనికి రావని బావించాడని కానీ ఆ కళ్లజోడును బ్రిస్టోల్ ఆక్షన్‌కు పంపడంతో అతని జీవితం మారిపోయిందని తెలిపాడు.

కాగా ఈ కళ్లజోడును కొనేందుకు భారత్‌, ఖతార్‌, అమెరికా, రష్యా, కెనడా వంటి దేశాల నుంచి బిడ్లు వచ్చినట్టు సంస్ద తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube