నెల రోజుల తర్వాత ... వాషింగ్టన్‌లో మహాత్మా గాంధీ విగ్రహం పునరుద్ధరణ

అమెరికాలో నిరసనకారుల చేతిలో ధ్వంసమైన భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించారు.సుమారు నెల రోజుల తర్వాత మహాత్ముడి విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ గురువారం ఉదయం తిరిగి ప్రారంభించారు.

 Mahatma Gandhi Statue Inaugurated In Us Washington After Vandalism By Protesters-TeluguStop.com

మే 27న శ్వేతజాతి పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు గురయ్యారు.దీంతో ఎన్నో ఏళ్లుగా తెల్లజాతీయుల ఆగడాలను పంటి బిగువున భరించిన నల్లజాతీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

Telugu George Floyed, Indian Embesey, Mahatma Gandhi, Balck Peoples, Washington-

దీంతో తమకు న్యాయం చేయాలంటూ నిరసనలు మిన్నంటాయి.ఈ సమయంలో జూన్ 3వ తేదీన వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీ సమీపంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు.దీనిపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయంతో పాటు భారతీయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.దీనిపై ఇండియన్ ఎంబసీ కేసు కూడా నమోదు చేయించింది.అనంతరం వెంటనే విగ్రహాన్ని పునరుద్ధరించే పనులు ప్రారంభించింది.పార్క్ పోలీసుల విచారణలో గాంధీ విగ్రహం ధ్వంసం ఆందోళనకారుల పనే అని తేలింది.

Telugu George Floyed, Indian Embesey, Mahatma Gandhi, Balck Peoples, Washington-

కాగా జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న చావిన్‌తో పాటు టై తావో, కూయెంగ్, థామస్‌ లేన్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి.అయితే టై తావో, కూయెంగ్ బెయిల్‌పై విడుదయ్యారు.వీరంతా నేరానికి పాల్పడినట్లు రుజువైతే దాదాపు నలభై ఏళ్ల జైలు శిక్ష పడొచ్చని తెలుస్తోంది.వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న డెరెక్ చావిన్‌పై సెకండ్ డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు కావడంతో ఆయనకు ఎక్కువ కాలం శిక్ష పడే అవకాశముంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube