మహాత్మాగాంధీ ముని మనవరాలికి 7 ఏళ్లు జైలు శిక్ష.. అదికూడా దక్షిణాఫ్రీకా!

అవును! ఇది షాకింగ్‌ విషయమే! స్వయానా మహాత్మాగాంధీ ముని మనవరాలికి 7 ఏళ్లు జైలు శిక్ష విధించారు.అది కూడా దక్షిణాఫ్రికాలో…ఇది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

 Mahatma Gandhi Great Grand Daughter Sentenced To 7 Years Imprisonment In South A-TeluguStop.com

ఆశిష్‌ లతా రాంగోబిన్‌ మహాత్మా గాంధీ ముని మనవరాలు.అసలు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష పడటానికి కారణం ఏంటో తెలుసుకుందాం.లతా రాంగోబిన్‌ ఓ ఫోర్జరీ కేసులో రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో ఆమెను సోమవారం డర్బన్‌ కోర్టు దోషిగా తేల్చుతూ ఏడేళ్ల జైలుశిక్ష విధించింది.

లత ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఖమహారాజ్‌ను వ్యాపారానికి సంబంధించిన విషయంలో మోసం చేసినట్టు కోర్టు తెలిపింది.వివరాల్లోకి వెళితే.2015 ఆగస్టులో ఆశిష్‌ లతా, మహారాజ్‌కు పరిచయమయ్యారు.ఆయన న్యూ ఆఫ్రికా ఎలియాన్స్‌ ఫుట్‌వేర్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థకు డైరెక్టర్‌.

ఈ కంపెనీ క్లాథింగ్, లెనీన్‌ ఇతర విక్రయాలు చేస్తుంది.అలాగే ఈ కంపెనీ ఇతర వ్యాపారులకు కూడా ఆర్థిక సాయం చేస్తుంది.

ఆ తర్వాత వచ్చే లాభాల్లో కొంత భాగం పొందుతుంది.ఇందులో భాగంగానే లతా.భారత్‌ నుంచి దక్షిణాఫ్రీకాకు వచ్చే ఓ కన్‌సైన్‌మెంట్‌కు ఇంపోర్ట్‌ అండ్‌ కస్టమ్స్‌ డ్యూటీకి చెల్లించేందుకు మహారాజ్‌ వద్ద నుంచి అడ్వాన్స్‌గా రూ.3.23 కోట్లు అంటే దాదాపు 62 లక్షల ర్యాండ్లు తీసుకుంది.కానీ, ఆ కన్‌సైన్మెంట్‌ నిజం కాదు ఫేక్‌ బిల్లులు సృష్టించి ఆయన్ను మోసం చేశారు.

అసలు ఈమె కూడా ప్రముఖ హక్కుల పోరాటయోధురాలు.

అది కూడా గాంధీ మునిమనుమరాలు.ఈమె ఎలా ఈ మోసానికి పాల్పడుతుందని కేసు విచారణ 2015 లోనే ప్రారంభమైంది.కానీ, సుధీర్ఘ కోర్టు విచారణల తర్వాత ఆమె మోసపూరితంగానే ఈ చర్యకు పాల్పడిందని, ఫేక్‌ ఇన్వాయిస్, డాక్యుమెంట్లను సృష్టించారని కోర్టు స్పష్టం తేల్చింది.

అయితే, అరెస్టు అయిన లతా 50 వేల ర్యాండ్ల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు.గతంలో ఇదే సౌత్‌ఆఫ్రీకాలో మహాత్మాగాంధీ న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ ఎంతో మంది అనగారిన పేదల తరఫున వాదించారు.

ఆయన మనవరాలు ఎలా గాంధీ కూడా ప్రముఖ న్యాయవాదిగా అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.ఇరు దేశాలను నుంచి సత్కారాలు పొందారు.ఆమె కూతురే ఆశిష్‌ లతా.ఈమె మాత్రం ఇలా మోసపూరిత చర్యల వల్ల ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube