హఠాత్పరిణామాల నేపథ్యంలో మృతి చెందిన గాంధీ!  

Mahatma Gandhi Died Due To Accidental Reasons!-cm Naveen Patnayak,gandhi And Gadse,mahatma Gandhi

జాతి పిత మహాత్మాగాంధీ ఎలా మృతి చెందారు అన్న విషయం అందరికి తెలిసిందే.ఆయనను గాడ్సే అనే వ్యక్తి దారుణంగా గన్ తో పేల్చి హతమార్చారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.

Mahatma Gandhi Died Due To Accidental Reasons!-cm Naveen Patnayak,gandhi And Gadse,mahatma Gandhi Telugu Viral News Mahatma Gandhi Died Due To Accidental Reasons!-cm Naveen Patnayak Gandhi And Gadse M-Mahatma Gandhi Died Due To Accidental Reasons!-Cm Naveen Patnayak Gandhi And Gadse

కానీ ఒడిశా లోని ఒక ప్రభుత్వ పాఠశాల పుస్తకం లో మాత్రం యాక్సిడెంటల్ కారణాల వల్ల ఆయన మృతి చెందారు అంటూ ప్రచురించడం ఇప్పుడు పెను వివాదానికి దారి తీసింది.పలువురు పలు రాజకీయ నేతలు యాక్టివిస్టు లు ఈ పొరపాటును వెంటనే సరిదిద్దాలని, సీఎం నవీన్ పట్నాయక్ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

గాంధీజీ 150 వ జయంతి సందర్భంగా ప్రచురితమైన బుక్ లెట్ లో.1948 జనవరి 30 న హఠాత్తుగా సంభవించిన పరిణామాల కారణంగా ఢిల్లీలోని బిర్లా హౌస్ లో ఆయన మరణించారని ఆ బుక్ లెట్ లోపేర్కొన్నారు.దీంతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఇరకాటంలో పడినాట్లు అయ్యింది.

రాష్ట్ర స్కూలు, మాస్ ఎడ్యుకేషన్ శాఖ ప్రచురించిన పుస్తకమిది.ఈ వైనంపై కాంగ్రెస్ తో బాటు పాలక బీజేడీ సభ్యులు కూడా రాష్ట్ర అసెంబ్లీలో తీవ్రంగా మండిపడ్డారు.

సీఎం నవీన్ పట్నాయక్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని సీఎల్ఫీ నేత నరసింహ మిశ్రా డిమాండ్ చేశారు.

ఆయనను ఈ దేశం క్షమించదన్నారు.

‘ అంటే గాంధీజీని గాడ్సే చంపలేదన్నది ఈ ప్రభుత్వ అభిప్రాయమా అని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించిన ఆయన గాడ్సేని ఉరి తీసిన విషయం కూడా ఈ సర్కార్ మరిచిందా అంటూ ప్రశ్నించారు.బీజేపీ, బీజేడీ రెండు పార్టీలూ ఒకే నాణేనికి ఉన్న బొరుసుల్లాంటివని ఆయన విమర్శించారు.

మరోపక్క ఈ వివాదాస్పద అంశాన్ని వెంటనే తొలగించాలని సీఎం నవీన్ పట్నాయక్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.