మహర్షి' ఈ రెండు రోజులే.. తర్వాత పరిస్థితిపై నిర్మాతల ఆందోళన  

Maharshi This Two Days Later Producers Worry About The Situation-25th Movie,maharshi,movie Updates,producers,situation,super Hit,two Days,నిర్మాత

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25వ చిత్రం మహర్షి తాజాగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రంకు ఓపెనింగ్స్‌ అయితే బాగానే వచ్చాయి కాని లాంగ్‌ రన్‌ కలెక్షన్స్‌పై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గురువారం విడుదలైన ఈ చిత్రంకు రెండవ రోజు అంటే శుక్రవారం కూడా మంచి కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి. ఇక శని మరియు ఆదివారాలు కూడా తప్పకుండా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుందని అంటున్నారు...

మహర్షి' ఈ రెండు రోజులే.. తర్వాత పరిస్థితిపై నిర్మాతల ఆందోళన-Maharshi This Two Days Later Producers Worry About The Situation

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంను చిత్ర యూనిట్‌ సభ్యులు సూపర్‌ హిట్‌గా చెబుతున్నారు. అయితే అంత సీన్‌ లేదనే విషయం వారికి కూడా అర్ధం అయ్యింది.

మొదటి నాలుగు రోజుల్లో 100 కోట్ల రూపాయలను ఈ చిత్రం సాధిస్తే పర్వాలేదు, లేదంటే మాత్రం బయ్యర్లు బలి అవ్వాల్సిందే అంటూ నిర్మాతలు టెన్షన్‌ పడుతున్నట్లుగా తెలుస్తోంది. బయ్యర్లు లాస్‌ అయితే అది నిర్మాతలపై పడే అవకాశం ఉంది.

అందుకే ఇప్పుడు నిర్మాతలు మహర్షికి సోమవారం నుండి కలెక్షన్స్‌ ఎలా వస్తాయా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోమవారం నుండి శనివారం వరకు ఒక మోస్తరుగా వసూళ్లు వచ్చినా, మళ్లీ శని, ఆదివారాల్లో నిలిచి, బాగానే రాబట్టే అవకాశం ఉంటుంది. అంటే మొదటి పది రోజులు పూర్తి అయ్యే సమయంకు గౌరవ ప్రధమైన వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

100 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రం కనీసం 125 కోట్లు సాధిస్తేనే సూపర్‌ హిట్‌గా చెప్పుకోవాలి. 100 కోట్లు సాధిస్తే మాత్రం బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకుని, యావరేట్‌ గా నిలిచినట్లుగా భావించాలి. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే విషయం మరి కొన్ని రోజుల్లో తేలిపోబోతుంది. ఇక ఇదే సమయంలో మహేష్‌బాబు తన 26వ చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నాడు. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతుంది.