ఫ్లాప్‌ మూవీకి కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్‌ మీట్‌?  

Maharshi Successmeet In Vijayawada-vijayawada,మహర్షి,మహేష్‌ 25,సిల్వర్‌ జూబ్లీ

మహేష్‌ 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అంచనాలను ఆ చిత్రం అందుకోవడంలో విఫలం అయ్యింది. దాదాపు 100 కోట్ల బిజినెస్‌ చేసిన మహర్షి చిత్రం ఇప్పుడు ఆ మార్క్‌ను దక్కించుకోవడం కష్టమే అంటున్నారు. అసలు బ్రేక్‌ ఈవెన్‌ అయ్యేనో కాదో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉన్న మహర్షికి బ్లాక్‌ బస్టర్‌ ఈవెంట్‌ అంటూ భారీ ఎత్తున ఒక సక్సెస్‌ వేడుకను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి..

ఫ్లాప్‌ మూవీకి కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్‌ మీట్‌?-Maharshi Successmeet In Vijayawada


సినిమా విడుదలకు ముందే ఈ వేడుక గురించి అధికారికంగా ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు సినిమా యావరేజ్‌గా ఆడిందని సక్సెస్‌ వేడుకను మాత్రం మానేయడం లేదు. తప్పకుండా నిర్వహించి తీరాల్సిందే అంటూ నిర్ణయించుకున్నారు. మహేష్‌బాబుతో వర్క్‌ చేసిన దర్శకులు, నిర్మాతలు ఇంకా పలువురు టెక్నీషియన్స్‌ మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.