'మహర్షి' సెన్సార్‌ రిపోర్ట్‌... సెన్సార్‌ బోర్డు సభ్యుల స్పందన ఏంటో తెలుసా?

మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రంను దిల్‌రాజు అశ్వినీదత్‌ మరియు పీవీపీలు నిర్మించారు.

 Maharshi Sensor Report-TeluguStop.com

ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది.ఈ చిత్రంను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు సెన్సార్‌ బోర్డు కూడా క్లీయరెన్స్‌ ఇచ్చింది.ఈ చిత్రంకు సెన్సార్‌ బోర్డు నుండి యూ/ఎ సర్టిఫికెట్‌ దక్కింది.

ఈ చిత్రంకు క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశించారట.అయితే కొన్ని యాక్షన్‌ సీన్స్‌ ఉన్న కారణంగా ఈ చిత్రంకు యూ/ఎ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంపై సెన్సార్‌ బోర్డు సభ్యులు ప్రశంసలు కురిపించారట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సెన్సార్‌ బోర్డు సభ్యులకు కథ బాగా నచ్చడంతో పాటు, మహేష్‌బాబు పాత్ర మరియు అల్లరి నరేష్‌ ఎమోషనల్‌ సీన్స్‌ బాగున్నాయట.

చిత్ర నిర్మాతలకు ఈ చిత్రం బాగుందంటూ స్వయంగా సెన్సార్‌ బోర్డు వారు శుభాకాంక్షలు తెలపడం కూడా జరిగిందని ఫిల్మ్‌ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

'మహర్షి' సెన్సార్‌ రిపోర్ట్‌

భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం మహేష్‌ బాబు కెరీర్‌ లో 25వ చిత్రం అనే విషయం తెల్సిందే.మైలు రాయి చిత్రం అవ్వడం వల్ల మహేష్‌బాబు చాలా ఓప్స్‌ ఈ చిత్రంపై పెట్టుకున్నాడు.అందుకే ఈ చిత్రంను చాలా జాగ్రత్తలు తీసుకుని, దాదాపు సంవత్సర కాలం పాటు వెయిట్‌ చేసి మరీ మహేష్‌బాబు చేయడం జరిగింది.

ఈ చిత్రంలో మొదటి సారి మహేష్‌బాబు గడ్డం మీసాలు పెంచుకుని కనిపించడంతో పాటు, ఒక రైతుగా కూడా నటించాడు.మహేష్‌బాబు కెరీర్‌లో నిలిచి పోయే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

మరి ఈ చిత్రం ఎలా ఉంటుందనేది మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube