ఉగాది రోజున ఫాన్స్ ని పలకరించనున్న మహర్షి  

ఉగాది రోజు రానున్న మహర్షి టీజర్. .

Maharshi Movie Teaser Release In Ugadi-maharshi Movie Teaser,pooja Hegde,release In Ugadi,super Star Mahesh Babu,vamsi Paidipalli

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా సంయుక్త నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా మహర్షి..

ఉగాది రోజున ఫాన్స్ ని పలకరించనున్న మహర్షి-Maharshi Movie Teaser Release In Ugadi

సూపర్‌స్టార్‌ మహేష్‌కు కెరియర్ లో ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఇక ఇందులో మహేష్ కి జోడీగా మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే నటిస్తూ ఉండగా, అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఫ్రెండ్ షిప్, అండ్ లవ్ స్టొరీగా, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

ఇక ఊపిరి సినిమా తర్వాత వంశీ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా కావడం, అలాగే భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న చిత్రం కావడంతో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన లెరికల్ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ని ఉగాది రోజైన ఈ నెల 6వ తేదిన రిలీజ్ చేయడనికి సిద్ధం అయినట్లు తాజాగా స్పష్టం చేసారు. మరి టీజర్ సూపర్ స్టార్ ఫాన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే.