'మహర్షి' నుండి ఫ్యాన్స్‌ నిరాశ పడే అప్‌డేట్‌  

Maharshi Movie Team To Skip One -maharshi,maharsi Shooting,mahesh Babu,pooja Hegde

 • సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ విడుదలకు ఇంకా సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. ఇలాంటి పెద్ద సినిమాలు విడుదలకు నెల రోజుల ముందే షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదల ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కాని ‘మహర్షి’ చిత్రం మాత్రం ఇంకా రెండు పాటల చిత్రీకరణ మరియు కొంత టాకీ పార్ట్‌ బ్యాలన్స్‌ ఉందట. రెండు పాటల చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్టింగ్స్‌ను నిర్మిస్తున్నారు.

 • 'మహర్షి' నుండి ఫ్యాన్స్‌ నిరాశ పడే అప్‌డేట్‌-Maharshi Movie Team To Skip One Song

 • మరో వైపు అబుదబీలో చిత్రీకరణకు ఏర్పాట్లు జరిగాయి. రెండు పాటల చిత్రీకరణకు రెండు వారాలు పట్టడంతో పాటు, అబుదబీ షెడ్యూల్‌ కనీసం రెండు వారాలు పట్టే అవకాశం ఉంది.

 • ఇలాంటి సమయంలో ఒక పాటను స్కిప్‌ చేసేస్తే పోయేది ఏం లేదని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారట. అందుకే ఒక పాట చిత్రీకరణను ప్రస్తుతంకు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

 • ఒక పాట చిత్రీకరణ చేసి ఆ తర్వాత అబుదబీ వెళ్లి అక్కడ టాకీ పార్ట్‌ను పూర్తి చేయాలని వంశీ పైడిపల్లి భావిస్తున్నాడు.

  Maharshi Movie Team To Skip One Song-Maharshi Maharsi Shooting Mahesh Babu Pooja Hegde

  అలా అయితే ఈనెల మూడవ వారంకు షూటింగ్‌ పూర్తి చేసే అవకాశం ఉంది. షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత టైం ఉంటే అప్పుడు పాటను చిత్రీకరించడం లేదంటే సినిమా విడుదలైన తర్వాత టాక్‌ను బట్టి పాటను చిత్రీకరించి రెండవ వారం నుండి సినిమాకు జోడించాలని భావిస్తున్నారు.

 • మొత్తానికి ఇది మహర్షి ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌గా చెప్పుకోవాలి. ఎందుకంటే పక్కా కమర్షియల్‌ సినిమా అంటే మంచి మాస్‌ మసాలా సాంగ్స్‌ ఉండాలి.

 • ఒకవేళ అవి లేకపోతే సినిమా ఆడటం కష్టం. ఆ ఒక్క పాట సినిమా ఫలితాన్ని మార్చేస్తుందేమో అనే భయంతో ఫ్యాన్స్‌ ఉన్నారు.