మహార్షి సినిమా కు సీక్వెల్...2020 లో సెట్స్ పైకి  

Maharshi Movie Sequel Going To The Sets-mahesh Babu,seqwell,vamshi Paidipally,మహార్షి,మహేష్‌ బాబు

ఇటీవల ప్రిన్స్ మహేష్ బాబు మహర్షి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.90 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి రికార్డ్ ని సృష్టించింది. బాబు ల్యాండ్ మార్క్ సినిమా గా వచ్చిన ఈ చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది అని చెప్పాలి..

మహార్షి సినిమా కు సీక్వెల్...2020 లో సెట్స్ పైకి -Maharshi Movie Sequel Going To The Sets

అయితే వీరిద్దరి కాంబినేషన్ లోనే మరో చిత్రం వస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తుంది. మహర్షి సినిమా కు సీక్వెల్ తీయబోతున్నారు అంటూ ఇప్పుడు ఒక వార్త బాగా వినిపిస్తుంది.

అయితే దీనిపై అటు వంశీ గానీ, ఇటు మహేష్ బాబు గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ జనాలు మాత్రం తెగ ఊహించేసుకుంటున్నారు. ఇంకా ఈ చిత్రం 2020 లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతుంది అని కూడా వార్తలు వస్తున్నాయి.

ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం మహర్షి సక్సెస్ తో ఆ చిత్ర బృందం మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మహర్షి సినిమా రిలీజైన తరువాతే మహేష్ తన కుటుంబం తో కలిసి విదేశాలకు టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన టూర్ నుంచి తిరిగి వచ్చాక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మహేష్ దృష్టిపెట్టనున్నారు.