'మహర్షి' మొదటి రోజు కలెక్షన్స్‌ పరిస్థితి ఏంటీ... బయ్యర్ల పరిస్థితి ఏంటీ?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా రూపొందిన ‘మహర్షి’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో భారీ మొత్తానికి అన్ని ఏరియాల్లో బయ్యర్లు కొనుగోలు చేయడం జరిగింది.అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం దాదాపుగా 100 కోట్లకు పైగా అమ్ముడు పోయిందనే టాక్‌ ఉంది.

 Maharshi Movie First Day Collections-TeluguStop.com

ఇక ఇతర రైట్స్‌ ద్వారా మరో 50 కోట్ల రూపాయలు నిర్మాతల ఖాతాలో పడ్డాయి.మొత్తంగా చిత్రం 150 కోట్ల ప్రీ రిలీజ్‌ చేయడంతో మహేష్‌ తన సత్తా చాటాడు.ఈ చిత్రం మహేష్‌కు చాలా ప్రత్యేకం అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ చిత్రం మహేష్‌బాబుకు 25వ చిత్రం.
100 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిన ఈ చిత్రం కనీసం 110 కోట్ల వసూళ్లను రాబడితేనే బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకున్నట్లు అవుతుంది.అయితే నిన్న వచ్చిన టాక్‌ మరియు కలెక్షన్స్‌ను బట్టి చూస్తే బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకోవడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాలను సినిమా అందుకోలేక పోయిందనే టాక్‌ వినిపిస్తుంది.

సినిమా అంచనాలకు కాస్త తగ్గిందనే టాక్‌ కూడా ఉంది.అందుకే ఈ చిత్రం వసూళ్ల విషయంలో ఇప్పుడు బయ్యర్లు బయపడుతున్నారు.

'మహర్షి' మొదటి రోజు కలెక్షన్స్

ప్రస్తుతం సమ్మర్‌ హాలీడేస్‌ అవ్వడంతో పాటు, పెద్ద సినిమాలు ఏవీ పోటీకి లేని కారణంగా రెండు వారాల పాటు మహర్షి కుమ్మేయడం ఖాయం అనుకున్నారు.అయితే టాక్‌ మిశ్రమంగా వచ్చిన కారణంగా ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.మొదటి రోజు ఈ చిత్రం దాదాపుగా పాతిక కోట్ల వరకు రాబట్టింది.మొదటి వారాంతంకు 75 నుండి 85 కోట్లు రాబడితే బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకున్నట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ చిత్రం తుది ఫలితం నిర్మాతలకు ఎలాంటి అనుభవంను మిగల్చనుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube