'మహర్షి' 10 రోజుల కలెక్షన్స్‌.. బయ్యర్లు బయట పడేనా తేలిపోయింది  

Maharshi Movie 10 Days Collections-maharshi Movie Collections,mahesh Babu,punam Hegde,మహర్షి

మహేష్‌ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన మహర్షి చిత్రంకు విడుదల ముందు రోజు వరకు కూడా అంచనాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా మహర్షి ఉంటుందని 100 కోట్ల షేర్‌ను సునాయాసంగా వసూళ్లు చేస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా మహర్షి చిత్రంకు యావరేజ్‌ టాక్‌ వచ్చింది. రివ్యూలు మరీ దారుణంగా వచ్చాయి..

'మహర్షి' 10 రోజుల కలెక్షన్స్‌.. బయ్యర్లు బయట పడేనా తేలిపోయింది-Maharshi Movie 10 Days Collections

కొన్ని సైట్లు సినిమా ఏమాత్రం బాగా లేదని, ఫ్లాప్‌ అంటూ రాశాయి. కాని మొదటి నాలుగు రోజుల్లోనే 100 కోట్ల షేర్‌ను రాబట్టి వావ్‌ అనిపించుకుంది. ఇక ఇప్పుడు మహర్షి చిత్రం లాంగ్‌ రన్‌ కలెక్షన్స్‌ చూస్తుంటే నిర్మాతల మరియు బయ్యర్ల గుండె జారిపోతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘మహర్షి’ చిత్రం మొదటి 10 రోజుల్లో 65 కోట్ల షేర్‌ను రాబట్టింది. రెండవ వీకెండ్‌ కూడా పూర్తి అయిన నేపథ్యంలో మరో పది లేదా పదిహేను కోట్ల వరకు రాబట్టగలదని అంటున్నారు.

మహా అయితే 20 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. అంతుకు మించి సినిమా ఎక్కువ రాబట్టడం అసాధ్యం అన్నట్లుగా సినీ వర్గాల వారు కూడా విశ్లేషిస్తున్నారు. అంటే ఫైనల్‌గా సినిమా 85 కోట్ల లోపులోనే ఉంటుందన్న మాట. అంటే సినిమా 15 కోట్ల మేరకు నష్టాలు మిగిల్చే అవకాశం ఉందన్నమాట..

బయ్యర్లు సేఫ్‌ అవ్వాలి అంటే ఇంకా 35 కోట్ల వసూళ్లు సాధ్యం అవ్వాలి. కాని ఇప్పటికే 10 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో 35 కోట్లు అంటే రికార్డులు బ్రేక్‌ చేసే మూవీ అయితే తప్ప ఊహించడం కష్టం. కాని మహర్షి చిత్రం మాత్రం ఓకే అన్నట్లుగా వసూళ్లు రాబట్టడంతో పాటు, టాక్‌ను దక్కించుకుంది. అందుకే బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకోవడం అసాధ్యంగా చెబుతున్నారు.

దాంతో బయ్యర్లు బయట పడటం అసాధ్యంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.