అల్లరోడికి ఏమాత్రం కలిసి రాలేదు.. మళ్లీ సొంత కష్టమే  

Maharshi Disappoints Allari Naresh-maharshi,mahesh Babu,vamshi Paidipally,అల్లరి నరేష్‌,కామెడీ

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అల్లరి నరేష్‌ ఆ చిత్రంలో కీలక పాత్రను పోషించేందుకు ఒప్పుకున్నాడు. వంశీ పైడి పల్లి రెండు సంవత్సరాల ముందు అల్లరి నరేష్‌కు ఈ సినిమా కథ చెప్పడం, అప్పుడే ఈ చిత్రంను ఒప్పుకోవడం జరిగింది. మహర్షి చిత్రంలో రవి పాత్రకు అల్లరి నరేష్‌ ఒప్పుకుంటే చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంతా భావించారు. అయితే సినిమా కథలో రవి పాత్ర ప్రముఖంగా అయితే ఉంది కాని, అల్లరి నరేష్‌కు మాత్రం సినిమాలో అంతగా ప్రాముఖ్యత కనిపించలేదు..

అల్లరోడికి ఏమాత్రం కలిసి రాలేదు.. మళ్లీ సొంత కష్టమే-Maharshi Disappoints Allari Naresh

మహర్షి చిత్రంతో రీ ఎంట్రీ అనుకున్న అల్లరి నరేష్‌ తీవ్రంగా నిరుత్సాహ పడ్డాడని భావించవచ్చు. వరుసగా చేస్తున్న సినిమాలు నిరుత్సాహ పర్చుతున్న సమయంలో ఇలాంటి సినిమాను చేసేందుకు అల్లరోడు ఓకే చెప్పాడు. కాని ఇది కూడా ఆయన కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పుకోక తప్పదు.

వంశీపైడిపల్లి దర్శకత్వంపై అల్లరోడు చాలా నమ్మకంగా ఒప్పుకున్నాడు. కాని సినిమా మాత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.

అల్లరి నరేష్‌ హీరోగా సక్సెస్‌ను దక్కించుకుంటేనే మళ్లీ ఆయన బిజీ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు 55 సినిమాలు చేసిన అల్లరి నరేష్‌ కెరీర్‌లో మరెన్నో సినిమాలు చేస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. కాని మహర్షి ప్లాఫ్‌తో మళ్లీ అల్లరి నరేష్‌ కెరీర్‌ కష్టాల్లో పడ్డట్లయ్యింది.

హీరోగా అల్లరోడు ఒక మంచి కామెడీ సక్సెస్‌ను దక్కించుకుంటే తప్ప ఆయన కెరీర్‌ మళ్లీ గాడిలో పడదు. సొంతంగా సక్సెస్‌ అయితేనే అల్లరి నరేష్‌కు మళ్లీ భవిష్యత్తు ఉండబోతుంది.