మళ్ళీ మహర్షి కాంబినేషన్ రిపీట్! వచ్చే ఏడాది సెట్స్ పైకి  

2020లో మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనున్న మహర్షి కాంబో. .

Maharshi Combination Repeat On 2020-mahesh Babu,repeat On 2020,vamshi Paidipalli

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ హీరోగా మహర్షి మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రికార్డ్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. మహేష్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్ చిత్రంగా మారబోతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు వందల కోట్ల కలెక్షన్ మార్క్ ని దాటేసింది అనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వేసేసాడు..

మళ్ళీ మహర్షి కాంబినేషన్ రిపీట్! వచ్చే ఏడాది సెట్స్ పైకి-Maharshi Combination Repeat On 2020

ఇక టూర్ నుంచి వచ్చిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సినిమా చేస్తాడనే టాక్ వినిపించింది. అది కాకుంటే త్రివిక్రమ్, లేదంటే రాజమౌళి దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని అందరూ భావించారు.

అయితే ఊహించని విధంగా మహేష్ బాబు మళ్ళీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే సెట్స్ పైకి వెళ్తుందని అయితే దానిని వచ్చే ఏడాది వేసవి వరకు సమయం పడుతుందని తెలుస్తుంది. దేనితో మహేష్ తో సినిమా అనుకున్న పరశురాం ఇప్పుడు మరో హీరోని వెతుక్కోవడానికి రెడీ అవుతున్నాడు అని తెలుస్తుంది.