కష్టపడుతున్న 'మహర్షి'... ఇంకా టెన్షన్‌లోనే బయ్యర్లు  

Maharshi Buyer\'s Still In Tension-25th Film,mahesh,movie Updates,positive Response,బయ్యర్లు

మహేష్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’ విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్‌ను దక్కించుకున్న ఈ చిత్రం 100 కోట్ల షేర్‌ దిశగా దూసుకు పోతుంది. మొదటి వారం పూర్తి అయ్యే వరకు ఈ చిత్రం 75 కోట్ల షేర్‌ను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకోవాలి అంటే 25 కోట్లకు మించి రావాల్సి ఉంటుంది. ఇక బయ్యర్లు లాభాల బాట పట్టాలి అంటే కనీసం 30 కోట్లు అయినా రాబట్టాలని సినీ వర్గాల వారు అంటున్నారు..

కష్టపడుతున్న 'మహర్షి'... ఇంకా టెన్షన్‌లోనే బయ్యర్లు-Maharshi Buyer's Still In Tension

రెండవ వారంలో కూడా ఈ చిత్రంకు పెద్దగా పోటీ లేని కారణంగా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుందనే టాక్‌ వినిపిస్తుంది. అయితే మహర్షి చిత్రం రెండవ వారంలో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. భారీ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు మాత్రమే రెండవ వారం తర్వాత 30 ఆపై వసూళ్లు సాధించాయి. ఇప్పుడు మహర్షి అంత వసూళ్లు సాధిస్తే అది రికార్డుగానే చెప్పుకోవాలి.

అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రాలు కూడా రెండవ వారంలో చతికిల్ల పడ్డాయి.

మహర్షికి కలిసి వచ్చే అంశం ఏంటీ అంటే ఈ చిత్రంకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ ఉండటంతో పాటు, పోటీగా మరే సినిమాలు లేకపోవడం. చిన్న చితకా సినిమాలు రేపు వచ్చినా కూడా అవి మహర్షి రేంజ్‌లో ఉండే అవకాశం లేదు. అందుకే మహర్షి బయ్యర్లకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ను తెచ్చి పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

బయ్యర్లు ఈ చిత్రం కోసం చాలా పెట్టారు. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా భారీగా పెట్టారు. ఇప్పుడు అవి రాబట్టడంకు భారీగా వసూళ్లు సాధించినా కూడా సరిపోవడం లేదు..

మరో వారం రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.