ప్రభుత్వ ఉద్యోగులకు ఝలక్, జీతాల్లో భారీ కోత ప్రకటించిన సర్కార్

కరోనా వైరస్

నేపథ్యంలో దేశవ్యాప్తంగా

లాక్ డౌన్

అమలవుతున్న విషయం తెలిసిందే.ఈ లాక్ డౌన్ వల్ల దేశ ఆర్ధిక పరిస్థితి గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది.

 Maharashtra Govt Slashes March Salary By 25 To 50%, Mlas Take A 60% Cut, Corona-TeluguStop.com

ఈ నేపధ్యంలో

మహారాష్ట్ర సర్కార్

అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు,ప్రజా ప్రతినిధులకు గట్టి ఝలక్ ఇచ్చింది.వారి జీతాల్లో నుంచి భారీ కోత విధించడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నుంచి గ్రామ పంచాయతీ సభ్యుల వరకు అందరికీ వేతనాల్లో 60 శాతం కోత విధిస్తున్నట్టు ప్రభుత్వం ఈ రోజు (మంగళవారం) ప్రకటించింది.లాక్ డౌన్ ఫలితంగా ఈ ఆర్ధిక సంవత్సరానికి రాబడి గణనీయంగా పడిపోయే అవకాశము ఉందని భావించిన

ఉద్దవ్ సర్కార్

ఉద్యోగులు,ప్రజాప్రతినిధుల వేతనాల్లో భారీ కోతకు సిద్ధమైంది.అంటే మార్చినెల వేతనంలో 40 శాతం మాత్రమే వారికి అందుతుంది.

క్లాస్ ఎ, క్లాస్ బి

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించనున్నట్టు

ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి అజిత్ పవార్

తెలిపారు.ప్రభుత్వం ఉద్యోగుల యూనియన్లతో జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ నిర్ణయం వల్ల కోవిడ్‌పై పోరుకు ప్రభుత్వానికి ఆర్థికంగా మరింత వెసులుబాటు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అయితే, క్లాస్-సి లోని క్లరికల్ ఉద్యోగులు మాత్రం తమ వేతనంలో 75 శాతం పొందుతారని,అలానే క్లాస్- డి ఉద్యోగులైన ప్యూన్లు, ఆఫీసు అసిస్టెంట్ల వేతనాల్లో మాత్రం ఎటువంటి కోత ఉండబోదు అంటూ ఆయన స్పష్టం చేశారు.ఈ విపత్కర సమయంలో వీరంతా ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్టు

అజిత్ పవార్

తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube