పశ్చిమబెంగాల్,ఝార్ఖండ్ ల బాటలోనే మరో రాష్ట్రం...

మొన్న పశ్చిమ బెంగాల్,నిన్న ఝార్ఖండ్ రాష్ట్రాలు తీసుకున్న రీతిలోనే మరో రాష్ట్రం కూడా జులై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయించుకుంది.దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కొత్త కొత్త కేసులు భారీ మొత్తంలో బయటపడుతున్నాయి.

 Maharashtra Extends State Wide Lock Down Extends Till July 31, Maharastra, Lock-TeluguStop.com

ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయాలు తీసుకోగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఆంక్షల విధింపుపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కలెక్టర్లకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది.

ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రతను బట్టి ఆంక్షలను విధించాలంటూ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది.అలానే అత్యవసరం కాని కార్యకలాపాలను కట్టడి చేయాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోని ఎక్కువ కేసులు బయటపడిన విషయం విదితమే.

ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యాప్తంగా 1,64,626 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.వీరిలో కరోనా తో పోరాడుతూ 86,575 మంది కోలుకోగా.7,429 మంది మరణించారు.ప్రస్తుతం మహారాష్ట్రలో 70,607 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు.

కరోనా కేసులు ఆ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో మహా సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కరోనా కేసులను కట్టడి చేసే క్రమంలో జులై 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోగా,ఇటీవల ఝార్ఖండ్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ను జులై 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు తోడు అత్యధిక కేసులు నమోదు అవుతున్న మహారాష్ట్ర కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube