మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదా?

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంకు రాష్ట్రపతి పాలనతో తెరదించారు.ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటు కాకుంటే అప్పుడు మహారాష్ట్రలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

 Maharastra Governament Farm Possible Or Not-TeluguStop.com

అయితే మహారాష్ట్రలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే విషయంపై పెద్దగా ఆసక్తి లేదంటూ జనాలు చెబుతున్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా మేధావులు కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే శివసేన మరియు కాంగ్రెస్‌ ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై ఇంకా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఎలాగూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న కారణంగా కాస్త మెల్లగానే చర్చలు జరిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన నిర్ణయించుకుంది.

మహారాష్ట్రలో డిసెంబర్‌ మూడు లేదా నాలుగవ వారం వరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం ఖాయం అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు బీజేపీ కూడా కొత్త ఎతుగడలు వేస్తూ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube