బయట పడ్డ “బాబా” అకృత్యాలు..వివాహితపై పలుమార్లు హత్యాచారం       2018-04-23   01:26:44  IST  Raghu V

దేశంలో జరుగుతున్న ఎన్నో అకృత్యాలు..ఘోరాలు..హత్యచారాలు ఇలా ఎన్నో నేర సంఘటనలు రోజు రోజు కి కోకొల్లలుగా తెలుసుకుంటూనే ఎంతో మంది అదే రీతిలో మోసపోతున్నారు..తాజాగా వెలుగు చూసిన ఒక ఘోరం మహిళల అమాయకత్వానికి నిదర్సనంగా నిలుస్తోంది..ఈ కాలంలో కూడా అనారోగ్యం కలిగితే బాబా లని ఆశ్రయిస్తున్నారు ఫలితంగా ఎంతో మంది మోస పోతున్నారు తాజాగా జరిగిన సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది..

ఆరోగ్యం బాగోలేదని బాబా ని నమ్మి వెళ్ళిన ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ బాబా ఆమె ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది..పోలీసుల కధనం ప్రకారం మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని భరత్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ వివాహిత ఆనారోగ్యంతో అక్కడి ఓ దర్గా వద్ద ప్రార్థనలు చేస్తుండగా..అబ్దుల్‌ అలీం పరిచయమయ్యాడు. తనకు తెలిసిన ముజఫర్‌ బాబా వద్దకు వెళ్తే వ్యాధి నయం అవుతుందని నమ్మించి ఆయన వద్దకు తీసుకెళ్లాడు..ఆ తరువాత ఆరోగ్యం బాగున్నా మళ్ళీ అదేవిధంగా ఉండటంతో మరో సారి అదే బాబాని ఆశ్రయించింది..

అయితే ఇదే అదునుగా భావించిన ఆ దొంగ బాబా తన గురువు చందా గ్రామంలో ఉంటాడు ఆయన వద్దకి వెళ్ళు వ్యాధి నయం అవుతుందంటూ’ ఆమెను నమ్మించాడు. ఈ నెల 8వ తేదీన ముజఫర్‌ బాబా..కౌసర్‌, అబ్దుల్‌, అలీం, అరుణ్‌లతో కలిసి కారులో అక్కడికి తీసుకెళ్లారు. దర్గాకు సమీపంలోని చెట్టు వద్ద పూజలు చేయాలని నమ్మించిన వాళ్లు..చాందటి గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతేకాదు తిరుగు ప్రయాణంలో సైతం ఆమెపై పలుమార్లు హత్యాచారం చేసి మార్గ మధ్యలో వదిలేసి వెళ్ళారు..అయితే ఈ ఆకృత్యాలని తమ సెల్ ఫోన్స్ లో భందించి ఆమెకి పంపి డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు దాంతో ఏమి చేయాలో తెలియని ఆ భాదిత మహిళ పోలీసులని ఆశ్రయించి బాబా తనపై చేసిన ఘోరాన్ని తెలిపి ఫిర్యాదు చేసింది…