ఆదర్శం : చెత్త ఏరుకునే మహిళ షార్ట్‌ ఫిల్మ్‌ తీసింది, ఆమె పట్టుదలకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే

సమాజంలో ఉన్న చెడు వల్ల నలుగురు బాధ పడుతూ ఉంటారు.కాని ఆ చెడును ఎత్తి చూపేందుకు మాత్రం ఎక్కువ శాతం జనాలు ఆసక్తి చూపించరు.

 Maharashtra Woman Maya Khodwe Doing Shot Films For Poor People Nasik-TeluguStop.com

చెడును ఎత్తి చూపడం వల్ల తాము ఎక్కడ చెడు అవుతామో అనే భయం చాలా మందిలో ఉంటుంది.కాని కొందరు మాత్రం తమను ఎవరు ఏం అనుకున్న పర్వాలేదు సమాజంలో ఉన్న పరిస్థితులపై పోరాటం చేస్తామంటూ ముందుకు వస్తారు.

అలాంటి వారిలో ఒకరు మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన మాయా ఖోడ్వే.

Telugu Maya Khodwe, Poor, Telugu Ups-Inspirational Storys

  మన దేశంలో ఎన్నో వృత్తుల వారు ఉంటారు.అలాంటి వృత్తుల్లో ఒకటి చెత్త ఏరుకుని జీవితం సాగించే వృత్తి ఒకటి.ఆ చెత్త ఏరుకునే వృత్తినే చేసే మహిళ మాయా ఖోడ్వే.

నాసిక్‌లో కొన్ని వందల మంది చెత్త ఏరుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటారు.ఒకరి వృత్తి మరొకరికి చిన్న చూపుగా అనిపిస్తుంది.

ముఖ్యంగా చెత్త ఏరుకునే వారిపై సామాన్యుల నుండి అందరికి కూడా చిన్న చూపే ఉంటుంది.వారి వృతి అది, దాన్ని వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అనే విషయాన్ని ఏ ఒక్కరు పట్టించుకోకుండా వారిని విమర్శించడం చేస్తూ ఉంటారు.

Telugu Maya Khodwe, Poor, Telugu Ups-Inspirational Storys

  మాయా ఖోడ్వే చెత్త ఏరుకునే సమయంలో కూడా ఆమె చాలా అవమానాలను ఎదుర్కొనేది.ఆమె వయసులో ఉన్న కారణంగా శారీరకంగా, మానసికంగా కొందరు రోడ్డున పోయే వారు అసభ్యంగా మాట్లాడుతూ హింసించేవారు.రాత్రి సమయంలో కొందరు అసభ్యంగా ప్రవర్తించిన రోజులు కూడా ఉన్నాయని మాయ చెప్పుకొచ్చింది.తన పరిస్థితి మాత్రమే కాకుండా తనలా చెత్త ఏరుకునే వారి అందరి పరిస్థితి ఇలాగే ఉందని గుర్తించి ఆమె చాలా బాధపడి ఏమైనా చేయాలని ఆలోచించింది.

Telugu Maya Khodwe, Poor, Telugu Ups-Inspirational Storys

  తమ బాధలు తెలిసేలా షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలని భావించింది.అందుకోసం ఒక స్వచ్చందసంస్థ ఉచితంగా కంప్యూటర్‌ శిక్షణ మరియు వీడియో రికార్డింగ్‌, ఎడిటింగ్‌లను నేర్చుకోవడం జరిగింది.ఇంగ్లీష్‌ పరిజ్ఞానం తక్కువ ఉండటంతో ఎక్కువగా ఆమె నేర్చుకోలేక పోయింది.నేర్చుకున్న దాంతోనే ఒక వీడియోను తీసింది.ఆ వీడియోను ఎడిటింగ్‌ చేసింది.అలా తన ప్రస్థానం మొదలు పెట్టింది.

ఆమె తీసే వీడియోలు చాలా సింపుల్‌గా డాక్యుమెంటరీ టైప్‌లో ఉంటాయి.

Telugu Maya Khodwe, Poor, Telugu Ups-Inspirational Storys

  తన వీడియోల ద్వారా మనుషుల్లో చైతన్యం కల్పించడంతో పాటు, ఎంతో మంది తనలా ఇబ్బంది ఎదుర్కొన్న చెత్త ఏరుకునే వారి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చింది.కూటికి గతిలేక చెత్త ఏరుకోవడం లేదని, ఒక వృత్తిగా బాధ్యతగా ఆ పని చేస్తున్నారని, చెత్త ఏరుకునే వారిలో కూడా ఆర్థికంగా పర్వాలేదు అన్నట్లుగా ఉన్న వారు చాలా మంది ఉన్నారు.అందరు ఒకే పని చేస్తే చెత్త ఏరే పని ఎవరు చేస్తారు అన్నట్లుగా ఉంటూ ప్రజల్లో ఆలోచన కలిగించే విధంగా మాయ వీడియోలు ఉంటాయి.

అందుకే ఆమెకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube