సజీవంగా నిలిచిన శివసేన ఆశలు, మహారాష్ట్రలో కొలువుదీరనున్న ప్రభుత్వం!

మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావడం లో జాప్యం కొనసాగుతూనే ఉంది.దీనితో అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

 Maharashtra To Have Full Term Shivasena Cm-TeluguStop.com

అయితే మొత్తానికి ఆ ఉత్కంఠ కు త్వరలో తెర పడనున్నట్లు తెలుస్తుంది.మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటు పై కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన పార్టీల మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చి అక్కడ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఒక క్లారిటీ లభించినట్లు తెలుస్తుంది.

మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసి అత్యధిక సీట్లు సంపాదించినప్పటికీ బీజేపీ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లో విఫలమైంది.

Telugu Bjp Siva Sena, Congress, Maharashtra, Maharashtrafull, Siva Sena Ncp, Siv

శివసేన కూడా సీఎం పదవి ని కూడా రెండున్నర సంవత్సరాలు పాటు పంచుకోవాలని పెట్టిన ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించడం తో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ విఫలమైంది.దీనితో ఎన్సీపీ,కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ శివసేన భావించగా దానికి ఎన్సీపీ, ఆ పార్టీ ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలంటూ డిమాండ్ చేయడం తో చివరికి శివసేన ఎన్డీయే కూటమి కి గుడ్ బై కూడా చెప్పేసింది.ఇన్ని మార్పులు చోటుచేసుకున్నప్పటికీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటు పై మాత్రం ఒక క్లారిటీ లేకుండా పోయింది.

అయితే మొత్తానికి ఇప్పుడు ఆ మూడు పార్టీ ల మధ్య చర్చలు ఒక కొలిక్కి రావడం తో అక్కడ త్వరలో ప్రభుత్వాన్ని కొలువుదీర్చనున్నారు.అధికారంలోకి వస్తే అమలు చేయాల్సిన కనీస ఉమ్మడి ప్రణాళికకు మూడు పార్టీలు ఆమోద ముద్ర వేయడం తో పాటు పదవుల పంపకాల విషయంలోనూ మూడు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరినట్లు సమాచారం.

Telugu Bjp Siva Sena, Congress, Maharashtra, Maharashtrafull, Siva Sena Ncp, Siv

మొదటి నుంచి శివసేన ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుపడుతుండటంతో ఐదేళ్ల పాటు పూర్తి స్థాయిలో సీఎం పదవిని శివసేనకే కేటాయించేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.ఈ రెండు పార్టీలకు ప్రభుత్వంలో చెరో 14 మంత్రి పదవులతో పాటు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎల్లుండి సోనియా గాంధీని కలవబోతున్న శరద్ పవార్ ప్రభుత్వ ఏర్పాటు పై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube