చెట్టు మీదే పాఠాలు,ఫిదా అవుతున్న నెటిజన్లు

కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు స్కూల్ కు దూరమైన విషయం తెలిసిందే.కరోనా ఏ టైం లో వచ్చిందో కానీ ఉద్యోగులు కార్యాలయాలకు దూరమైపోయారు, అలానే పిల్లలు స్కూల్ కు దూరమైపోయారు.

 Maharashtra Man Teaches Kids On Tree Top, Maharashtra, Tree Top, Online Classes,-TeluguStop.com

మాల్స్,షాపింగ్ లు అన్ని కూడా దాదాపు ఈ మహమ్మారి కారణంగా మూతపడిపోయాయి.అయితే పిల్లలు గత మార్చి నెల నుంచి స్కూల్స్ కు దూరమైపోతుండడం తో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టారు.

అయితే ప్రైవేట్ స్కూల్స్ లో అయితే పిల్లల తల్లిదండ్రులకు ఎలాగు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి వారంతా బాగానే క్లాసులకు అటెండ్ అవుతున్నారు.అయితే చిన్న చిన్న కూలి పనులు,ఇతర పనులు చేసుకొనేవారు తప్పనిసరి పరిస్థితుల్లో వారికి జీవనాధారమైన వస్తువులను సైతం అమ్మేసి మరీ వారికి స్మార్ట్ ఫోన్ లు ఇస్తున్నారు.

అయితే ఇంతగా అందరూ ఆన్ లైన్ క్లాసులకు సిద్దపడుతుంటే, ఈ మాస్టర్ మాత్రం చెట్టు పైకి ఎక్కి మరీ పాఠాలు చెబుతున్నారు.

అదేంటి మాస్టారు అయి ఉండి ఇలా చెట్టు ఎక్కి పాఠాలు చెప్పడం ఏంటి అని అనుకుంటున్నారా.

అదేదో సామెత ఉంది సీత కష్టాలు సీతవి,పీత కష్టాలు పీతవి అన్నట్లు స్టూడెంట్ కష్టాలు స్టూడెంట్ కి,మాస్టారు కష్టాలు మాస్టారు కి.మాస్టర్ వద్ద స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా వాటికి తగిన సిగ్నల్స్ లేక పాపం ఇలా చెట్టెక్కి మరీ పాఠాలు చెప్పాల్సి వస్తుంది.వివరాల్లోకి వెళితే…మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా ధడ్గావ్ గ్రామంలోని ఈ ఒక టీచర్ బ్లాక్ బోర్డు తో సహా చెట్టు పైకి ఎక్కారు.కొమ్మలపై కూర్చొని మరీ పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆ వూరిలో సరైన సిగ్నల్స్ లేకపోవడం తో ఆ టీచర్ ఆన్ లైన్ పాఠాలు చెప్పడం కోసం ఇలా చెట్టు పైకి ఎక్కి సిగ్నల్స్ రాగానే ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నారు.అయితే ఈ లోపు తనకు అందుబాటులో ఉన్న విద్యార్థులను సైతం తనతో పాటు చెట్టు కొమ్మలపైకి ఎక్కించుకోని మరీ పాఠాలు చెబుతున్నారు.

సిగ్నల్ లేనప్పుడు దగ్గర ఉన్న స్టూడెంట్స్ కు అలానే సిగ్నల్ రాగానే ఆన్ లైన్ లో పాఠాలు చెబుతున్నారు పాపం ఆ మాస్టారు.

Telugu Lockdown Effect, Maharashtra, Classes, Signal, Tree Top-Latest News - Tel

అయితే ఈ మాస్టారు గారి నిబద్ధత కు,చిత్తశుద్ధి కి గ్రామస్తులు సైతం ఫిదా అయిపోయి అంతా తెగ పొగిడేస్తున్నారు.అయితే ఈ మాస్టారు గారి ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ అవ్వడం తో నెటిజన్లు కూడా ఆ ఫోటో లను చూసి మాస్టారు గారిని తెగ పొగిడేస్తున్నారు.కొంత‌మంది మాత్రం చెట్టు మీద పిల్ల‌ల‌కు పాఠాలు అంటే ప్ర‌మాదంతో కూడుకున్న‌ది జాగ్ర‌త్త అంటూ కామెంట్లు పెడుతున్నారు కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube