రెండోసారి కరోనా బారిన పడ్డ ఆ రాష్ట్ర మంత్రి..!!

దేశంలో కరోనా కంట్రోల్ లోకి వచ్చేసింది, మరోపక్క వ్యాక్సిన్ కూడా వచ్చేసింది ఇంకా గతంలో మాదిరిగా బ్రతికేయొచ్చు అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కరోనా పడగ విప్పి నట్లు ఉంది.ఊహించని విధంగా దేశంలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఉన్నాయి.

 Maharashtra State Minister Dhananjay Munde Effected By Corona Twice , Maharashtr-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా దేశంలో కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి మహారాష్ట్రలో భారీ స్థాయిలో కేసులు బయటపడటం మనం చూశాం.ఆ తర్వాత దేశంలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్లు వ్యాక్సిన్ కూడా రావడంతో ఇంకా అంతా ఓకే అయినట్లు భావించారు.

కానీ ఇంతలోనే ఇటీవల కేసులు ఊహించని విధంగా పెరగటం మాత్రమేకాక మహారాష్ట్రలో భారీ స్థాయిలో కేసులు రావడంతో.అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉంది.

లాక్ డౌన్ , కర్ఫ్యూలు కూడా విధిస్తోంది.ఇదిలా ఉంటే మహా రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ధనంజయ్ ముండే గత ఏడాది జూన్ మాసంలో కరోనా బారిన పడటం మనకందరికీ తెలిసిందే.

అయితే తాజాగా రెండోసారి ఈ మంత్రికి కరోనా సోకడంతో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.దీంతో ఈయన హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

దీంతో ధనంజయ్ ముండే సోషల్ మీడియాలో గత వారం నుండి తనను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube