సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్లు కొన్ని ప్రయత్నాల్లో ఫెయిల్ అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమని, తమ వల్ల కాదని భావించి ఆ ప్రయత్నాలకు దూరంగా ఉంటారు.అయితే ఒక రైతుబిడ్డ మాత్రం 23సార్లు ఫెయిలైనా 24వ ప్రయత్నంలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వార్తల్లో నిలిచారు.
ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా ( Nanded District of Maharashtra State )మాతల గ్రామానికి చెందిన రైతుబిడ్డ సాగర్( Sagar ) ప్రభుత్వ పరీక్ష రాసిన ప్రతి సందర్భంలో ఆశాజనకంగా ఫలితాలు రాకపోయినా ఎప్పుడూ నిరాశ చెందలేదు.
గత పరీక్షలకు సంబంధించి చేసిన తప్పులను రిపీట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( Maharashtra Public Service Commission )పరీక్షకు హాజరైన సాగర్ ఆ పరీక్షలో 25వ ర్యాంక్ సాధించడం గమనార్హం.

ఈ ర్యాంక్ కు మంత్రుల కార్యాలయంగా క్లర్క్ గా పని చేసే అవకాశంతో పాటు ట్యాక్స్ అసిస్టెంట్ గా( Tax Assistant ) పని చేసే ఛాన్స్ ఉంటుంది.ఈ రెండు ఉద్యోగాలలో సాగర్ ఏ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటారో చూడాల్సి ఉంది.తనకు పరీక్షల్లో అనుకూల ఫలితాలు రావడం గురించి సాగర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని అన్నారు.గత 23 ప్రయత్నాలలో చాలా విషయాలను నేర్చుకున్నానని సాగర్ చెప్పుకొచ్చారు.

ప్రతిరోజూ పొలం పనులు పూర్తి చేసిన వెంటనే లైబ్రరీకి వెళ్లి చదువుకునేవాడినని సాగర్ కామెంట్లు చేశారు.మాతల గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తొలి వ్యక్తి సాగర్ కావడం గమనార్హం.సాగర్ ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు.సాగర్ ను భుజాలపైకి ఎత్తుకుని గ్రామస్తులు ఊరేగించడం గమనార్హం.సాగర్ సక్సెస్ స్టోరీ అద్భుతమైన స్టోరీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.