బొమ్మకు పోస్టుమార్టం నిర్వహించిన ‘మహా ‘ పోలీసులు  

Police Sent Doll for Post Mortem, Post Mortem, Maharashtra Police, Toy, Dead Body - Telugu Dead Body, Maharashtra Police, Police Sent Doll For Post Mortem, Post Mortem, Toy

మనం ఇంత వరకు ఎక్కడైనా సరే కేవలం మనుషులకు, జంతువులకు మాత్రమే పోస్టుమార్టం నిర్వహించడం చూశాం.అయితే తాజాగా మహారాష్ట్ర పోలీసులు చేసిన నిర్వహణకు ఓ బొమ్మ కూడా పోస్టుమార్టం చేయాల్సి వచ్చింది.

 Maharashtra Police Sent Doll For Post Mortem

అవును మీరు విన్నది నిజమే. మహారాష్ట్ర పోలీసులు తొందరలో శిశువు అనుకొని బొమ్మను తీసుకువచ్చి పోస్టుమార్టం చేయమని డాక్టర్లకు ఇచ్చారు.

అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే డాక్టర్లు కూడా ఆ బొమ్మను తీసుకు వెళ్లి పోస్టుమార్టం కోసం తీసుకువెళ్లి కోసి చూడగా అది మృతదేహం కాదని కేవలం ఆటబొమ్మ మాత్రమే అని తేల్చారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

బొమ్మకు పోస్టుమార్టం నిర్వహించిన మహా పోలీసులు-General-Telugu-Telugu Tollywood Photo Image

మహారాష్ట్ర బుల్దానా జిల్లా బోర్ జవల్ గ్రామం సమీపంలో ఓ నదిలో ఈనెల 9వ తారీఖున శిశువు మృతదేహం స్థానికులకు కనిపించింది.

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.ఆ తర్వాత మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.

ఆ పై కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.అంత పసిబిడ్డను నదిలో ఎవరైనా పడేశారో లేకపోతే ఎవరైనా చంపేశారా లాంటి అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు అనుకున్నారు.

ఇక అందులో భాగంగానే ఆ శిశువు ఎలా మరణించింది అన్న విషయంపై శోధన కోసం మృతదేహం అని భావించిన ఆ బొమ్మను పోస్టుమార్టం కొరకు ఆసుపత్రికి తరలించారు.ఇక అక్కడ అసలు విషయం బయట పడింది.

అది శిశువు మృతదేహం కాదని అది అచ్చం శిశువు లా కనిపించే ఆటబొమ్మ అని తేల్చారు.దీంతో ఆ పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు.

మనిషికి బొమ్మ కి తేడా తెలియకుండా పోలీసులు ఎలా అయ్యామని బాధ పడ్డారు కాబోలు.

#Post Mortem #Toy #Dead Body

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Maharashtra Police Sent Doll For Post Mortem Related Telugu News,Photos/Pics,Images..