పోలీసులపై కరోనా రక్కసి...ఏకంగా 234 మంది...!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం విదితమే.మరి ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది.

 Covid Pandemic For The Maharashtra State Police, Covid Pandemic, Maharashtra Sta-TeluguStop.com

అయితే ఈ మహమ్మారి ఇంతగా కోరలు చాపుతున్నప్పటికీ కూడా కరోనా వారియర్స్ మాత్రం తమ విధులను నిర్వర్తించడం తప్పడం లేదు.ఈ పోరాటంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న వారిలో పోలీసులే ముందు ఉన్నారు.

మహారాష్ట్రలోని పోలీసులపై కరోనా రక్కసి పంజా విసురుతూనే ఉంది.ఇప్పటికే ఈ మహమ్మారికి బలైన పోలీసుల సంఖ్య 234 కు చేరినట్లు తెలుస్తుంది.
ఒకపక్క దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నప్పటికీ మహారాష్ట్ర‌లో మాత్రం క‌రోనా బారిన‌డుతున్న పోలీసుల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డంలేదు.రోజురోజుకు ఆ రాష్ట్రంలో క‌రోనా సోకుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా ఆ రాష్ట్రంలో 253 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నమోదు కాగా, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం 21,827 మంది పోలీసులు ఈ మహమ్మారి బారిన పడ్డారు.ఇందులో 18,158 మంది కోలుకోగా, 3435 మంది చికిత్స పొందుతున్నారని మ‌హారాష్ట్ర పోలీసు శాఖ ప్ర‌క‌టించింది.

అయితే గడచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో ఐదుగురు పోలీసులు క‌రోనాతో చ‌నిపోవ‌డంతో ఇప్పుడు ఆ రాష్ట్రవ్యాప్తంగా మ‌ర‌ణించిన పోలీసుల సంఖ్య 234కు చేరినట్లు తెలుస్తుంది.మహా రాష్ట్రలో ఈరోజు 18,390 క‌రోనా కేసులు న‌మోద‌వ్వగా, కొత్త‌గా 392 మంది మ‌ర‌ణించారు.

ఈ తాజా సమాచారం తో ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,42,770 మంది క‌రోనా బారిన పడగా, ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 33,407 గా నమోదు అయినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube