14 మంది ప్రాణం పోవడానికి కారణం అయిన పీతలు! నమ్మాల్సిందేగా  

డ్యాం తెగి 14 మంది చనిపోవడానికి కారణం పీతలు అన్న మహారాష్ట్ర మంత్రి. .

Maharashtra Minister Blames Crabs For Dam Breach That Killed 14-

చలి చీమల చేత చిక్కి చావద సుమతి అనే మాట చిన్నప్పుడు ప్రతి ఒక్కరు చదువుకొని ఉంటాం.ఇప్పుడు ఓ సంఘటనకి అలాంటి కారణమే చెబుతుంది మహారాష్ట్ర ప్రభుత్వం.ఆనకట్ట తెగి 14 మంది చనిపోతే దానికి కారణం పీతలు అని అక్కడి ప్రభుత్వం చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.పీతల కారణంగా ఆనకట్ట తెగిపోయి అంత మంది ప్రాణాలు పోయాయని అద్బుతమైన కథ చెబుతుంది...

Maharashtra Minister Blames Crabs For Dam Breach That Killed 14--Maharashtra Minister Blames Crabs For Dam Breach That Killed 14-

అసలు విషయంలోకి వెళ్తే మహారాష్ట్ర లో రామ్ నగర్ జిల్లాలో ఓ డ్యాం ఆనకట్ట తెగి కొద్ది రోజుల క్రితం 14 పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది.

ఘటనపై స్పందించిన శివసేన నేత, నీటి పరిరక్షణ మంత్రి తానాజి సావంత్ మాట్లాడుతూ, డ్యామ్ చుట్టూ పీతల గుంపు చేరడం వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు.పీతల గుంపు వలన డ్యామ్ తెగిపోయి నీరు బయటకు ఒక్కసారిగా వచ్చిందని, ఈ కారణంగానే ఊహించని ప్రమాదం చోటు చేసుకుందని ఆశ్చర్యకరమైన సీక్రెట్ ని చెప్పారు.

Maharashtra Minister Blames Crabs For Dam Breach That Killed 14--Maharashtra Minister Blames Crabs For Dam Breach That Killed 14-

అయితే ఈ డ్యాంని తానాజీ సావంతి కాంట్రాక్ట్ సొంతం చేసుకొని నిర్మించారు.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నీటి పరిరక్షణ మంత్రి సావంవత్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నవాబ్ మాలిక్ కౌంటర్ ఇచ్చారు.ఆ డ్యామ్‌కు కాంట్రాక్టరైన సావంత్ నాసిరకం పనితో దాని నిర్మాణం చేసి ఇప్పుడు తన పాపాన్ని ఇలా పీతలపై నెట్టివేస్తున్నారని ఆరోపించారు.

అంత పెద్ద డ్యాం తెగిపోవడానికి కారణం పీతలు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.