హ్యాట్సాప్‌ : టీ తాగడానికి డబ్బులు లేవు, రూ.40 వేలు దొరికితే ఏం చేశాడో తెలుసా?

రెండు రూపాయల కోసం హత్యలు జరుగుతున్న కాలం ఇది.డబ్బు కోసం గడ్డి తింటారు అనే సామెత ఉంది.

 Maharashtra Man Jagdale Return 40000 Rs To Owner-TeluguStop.com

కేవలం గడ్డి మాత్రమే కాకుండా తవుడు తినడం నుండి ఫినాయిల్‌ తాగడం వరకు కూడా అన్ని డబ్బు కోసం చేస్తున్నారు.డబ్బు కోసం ఏం చేసేందుకు అయినా సిద్ద పడుతున్న ఈ సమాజంలో కొందరు మంచి వారు కూడా ఉండటం వల్ల ఇంకా ఈ సమాజం ఇలా మిగిలి ఉందని, మంచివారు ఉండటం వల్ల ఇంకా ఈ సృష్టి ఉందనిపిస్తుంది.

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జగ్దాలే అనే వ్యక్తి ఉన్నాడు.ఆయన లాంటి వారు ఉన్న కారణంగానే ఇంకా ఈ భూమి ఉందనిపిస్తుంది.

Telugu Jagdhale Mla, Mla Jagdhale, Bagamount-Inspirational Storys

ఇంతకు జగ్దాలే ఎవరు, ఆయన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.జగ్దాలే ఒక నిరుపేద.ఆయన అత్యంత కఠినమైన పేదరికంను అనుభవిస్తున్నాడు.అలాంటి పేదరికంలో ఉన్న ఆయన ఒక రోజు బస్‌ స్టాండ్‌లో ఉన్నాడు.సొంత ఊరికి వెళ్లేందుకు చేతిలో డబ్బులు లేవు, కనీసం టీ తాగడానికి అయిదు రూపాయలు లేవు.ఎలా అని చూస్తున్న సమయంలో అతడికి పక్కన ఒక బ్యాగ్‌ దొరికింది.

Telugu Jagdhale Mla, Mla Jagdhale, Bagamount-Inspirational Storys

ఆ బ్యాగ్‌ ఓపెన్‌ చూడగా 40 వేల రూపాయలు అందులో ఉన్నాయి.డబ్బు చూడగానే ఎవరికైనా ఆశ కలుగుతుంది.కాని జగ్దాలేకు మాత్రం ఆశ కలగలేదు.అయ్యో పాపం ఎవరి డబ్బు ఇది అనుకున్నాడు.చుట్టు పక్కల ఉన్న వారిని వాకబు చేశాడు.ఈ సంచిని ఎలాగైనా దాని ఓనర్‌ వద్దకు చేర్చాలని ఆశ పడ్డాడు.

చాలా మందిని అడుగుతూ ఉన్నాడు.ఇక పోలీసులకు ఆ బ్యాగ్‌ను అప్పగించాలని నిర్ణయించుకున్నాడు.

ఆ సమయంలోనే ఒక వ్యక్తి కంగారుగా తన బ్యాగ్‌ పోయింది అంటూ వచ్చాడు.అప్పుడు జగ్దాలే తన వద్ద ఉన్న బ్యాగ్‌ను చూపించి ఇదేనా అన్నాడు.

అప్పుడు ఆయన ఔను ఇదే నా బ్యాగ్‌, అందులో 40 వేల రూపాయలు ఉన్నాయి.నా భార్యకు ఆపరేషన్‌ కోసం తీసుకు వెళ్తున్నాను అన్నాడు.

Telugu Jagdhale Mla, Mla Jagdhale, Bagamount-Inspirational Storys

40 వేల రూపాయల బ్యాగ్‌ ఇచ్చినందుకు జగ్దాలేకు ఆ వ్యక్తి వెయ్యి రూపాయలు ఇవ్వబోయాడు.కాని ఆ డబ్బు వద్దన్న జగ్దాలే తనకు ఒక 10 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరాడు.ఆ డబ్బుతో తాను తన సొంత ఊరుకు వెళ్లాలనుకుంటున్నట్లుగా చెప్పాడు.జగ్దాలే విషయం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.ఆయనకు ఆర్థిక సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారు.ఒకసారి ఎమ్మెల్యే పిలిపించి మరీ సాయం చేస్తానంటూ అడిగాడు.

కాని జగ్దాలే మాత్రం సాయంకు ఒప్పుకోలేదు.

ఇటీవలే ఒక ఎన్నారై ఏకంగా అయిదు లక్షల రూపాయలను ఇస్తానంటూ ముందుకు వచ్చాడు.

వాటిని కూడా వదులుకున్నాడు.మొత్తంగా 20 లక్షల వరకు సాయంను జగ్దాలే తృణప్రాయంగా వదిలేసుకున్నాడు.

అందుకే ఈయన ఒక గొప్ప వ్యక్తి అంటూ స్థానికులు అంటున్నారు.ఇప్పుడు వైరల్‌ అవ్వడంతో ప్రపంచం మొత్తం ఆయన్ను గొప్ప వ్యక్తి అంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube