కేక్ కట్ చేసాడు.. దెబ్బకు జైలుకెళ్లాడు.. ఎందుకంటే..!?  

Man Arrested for cutting cake with Sword, Maharashtra man, Sword, Arrest, Social media, viral, Birthday cake - Telugu Arrest, Birthday Cake, Maharashtra Man, Man Arrested For Cutting Cake With Sword, Social Media, Sword, Viral

ఈ మధ్యకాలంలో మామూలుగా ఏ విషయాన్ని చేసిన అందరికీ తెలిసేలా చేయాలని చాలా మంది భావిస్తుంటారు.అందుకోసం మామూలు విషయాన్ని కూడా పెద్ద ఎత్తున జరిగినట్లుగా బిల్డప్ ఇవ్వడానికి నానా తంటాలు పడుతుంటారు కొందరు.

TeluguStop.com - Maharashtra Man Cuts Cake With Sword

ఇలాంటిదే తాజాగా ఓ వ్యక్తి అహంకారమో, లేకపోతే ఇంకా ఏదైనా తెలివిలేని తనమో అర్థం కాలేదు కానీ అతిగా ప్రవర్తించి చివరికి జైలు పాలయ్యాడు.ఓ వ్యక్తి తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జైలు పాలయ్యాడు.

తన పుట్టిన రోజునాడు కేక్ కట్ చేస్తే జైలుకు వెళ్లడం ఏంటి అనే కదా మీ ప్రశ్న.అవును ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - కేక్ కట్ చేసాడు.. దెబ్బకు జైలుకెళ్లాడు.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన 19 సంవత్సరాలు ఉన్న నిఖిల్ పటేల్ అనే వ్యక్తి తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులందరినీ పిలిచి ఘనంగా వేడుకలను చేసుకున్నాడు.ఇలా పార్టీకి వచ్చిన నిఖిల్ స్నేహితులు మొత్తం నాలుగు పెద్ద కేకులను ఆర్డర్ చేయించారు.

మామూలుగా మనం కేక్ లను ఏవిధంగా కట్ చేస్తాం.? మామూలుగా అయితే చిన్నపాటి కత్తి తీసుకుని కట్ చేస్తాం.కానీ, నిఖిల్ మాత్రం కాస్త ఎక్కువగా ఆలోచించి కటకటాల పాలయ్యాడు.

తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవాలని తాను కేక్ ను కత్తితో కట్ చేస్తే కొత్త ఏముంటుంది అని చెప్పి ఇంట్లోని ఓ పెద్ద తల్వార్ కత్తిని తీసుకోచ్చి కేకును కట్ చేశాడు.

ఈ తతంగం మొత్తం అతని స్నేహితులు ఫోటోలు, వీడియోలు తీసి మొదటగా వాట్సప్ లో షేర్ చేసుకున్నారు.ఆ తర్వాత ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఈ ఫోటోలు తాజాగా పోలీసుల కంట పడ్డాయి.ఇంకేముంది మారణాయుధాలు వాడకం చట్టం కింద పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు.

#Viral #Arrest #Maharashtra Man #ManArrested #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Maharashtra Man Cuts Cake With Sword Related Telugu News,Photos/Pics,Images..