మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్..?

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ అప్రమత్తం అవుతున్నాయి.ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా ఉదృతి బాగా పెరుగుతుంది.

 Maharashtra Lock Down Cm Uddhav Thackeray Press Meet Maharashtra Lock Down, Maha-TeluguStop.com

అందుకే మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు వచ్చినా రావొచ్చని అంటున్నారు మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే.మహారాష్ట్రలో కరోనా మరోసారి ఉగ్రరూపం చూపిస్తుంది.

శుక్రవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సిఎం ఉద్దవ్ ఠాక్రే ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ ప్రకటన చేసే అవకాశం లేదని.రానున్న రెండు మూడు రోజుల్లో కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని అన్నారు.

పరిస్థితి ఇలానే కొనసాగితే మళ్లీ లాక్ డౌన్ తప్పదని స్పష్టం చేశారు.ఈ మహమ్మారి వ్యాప్తి అడ్డుకట్ట వేసేందుకు లాక్ డౌన్ మాత్రమే కరెక్ట్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

నిపుణులతో దీనిపై చర్చలు జరుపుతున్నామని.ప్రజలు కూడా తన వంతు సహకారం అందించాలని.అంతేకాదు ఏదైనా మార్గం ఉంటే సూచించాలని కూడా కోరారు.ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు సిఎం ఉద్దవ్ ఠాక్రే.

అంతేకాదు పనిలో పనిగా ప్రతిపక్ష పార్టీలకు చురకలు వేశారు ఠాక్రే.ఈ విషయాన్ని రాజకీయం చేయకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు సహకరించాలని కోరారు.

మహారాష్ట్రలో కరోనా వైరస్ నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఇక్కడే కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు.

రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube