నాలుక కోస్తే రూ.కోటి ఇస్తారట.. అసలేం జరిగిందంటే..?- Maharashtra Karnisena Chief Ajay Sengar Tandav Web Series Issue

rs 1 crore reward who slits tongue those who insult hindu gods, slits tongue,hindu gods, karnisena chief ajay sengar, tandav web series - Telugu 1 Crore Reward, Hindu God\\'s, Insult Hindu Gods, Karnisena Chief Ajay Sengar, Rs 1 Crore Reward Who Slits Tongue Those Who Insult Hindu Gods, Slits Tongue, Tandav Web Series

ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 15వ తేదీన తాండవ్ వెబ్ సిరీస్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ వెబ్ సిరీస్ విడుదలైనప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ ను అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి.

 Maharashtra Karnisena Chief Ajay Sengar Tandav Web Series Issue-TeluguStop.com

దేశంలోని పలు పోలీస్ స్టేషన్ లలొ ఈ వెబ్ సిరీస్ గురించి కేసులు కూడా నమోదయ్యాయి.హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ఈ వెబ్ సిరీస్ లో సన్నివేశాలు ఉన్నాయని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే తాండవ్ చిత్ర బృందం వెబ్ సిరీస్ వివాదాలకు సంబంధించి క్షమాపణలు కోరినా వివాదం ముదురుతోంది.వివాదం పెద్దది కాకుండా తాండవ్ చిత్ర యూనిట్ వివాదాస్పద సన్నివేశాలను తొలగించనున్నట్టు కీలక ప్రకటన చేసింది.

 Maharashtra Karnisena Chief Ajay Sengar Tandav Web Series Issue-నాలుక కోస్తే రూ.కోటి ఇస్తారట.. అసలేం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా తాండవ్ వెబ్ సిరీస్ వివాదం గురించి మహారాష్ట్ర కర్నిసేన స్పందించింది.కర్ణి సేన చీఫ్ అజయ్ సెంగర్ మాట్లాడుతూ తాండవ్ వెబ్ సిరీస్ లో హిందూ దేవతలు, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి నాలుక కత్తిరించి తెచ్చిన వారికి కోటి రూపాయలు నజరానాగా ఇస్తానని అన్నారు.

వెబ్ సిరీస్ వివాదానికి సంబంధించి చిత్ర బృందం క్షమాపణలు కోరిందని అయితే చిత్రబృందం కోరిన క్షమాపణలు ఆమోద యోగ్యం కాదని అన్నారు.తాండవ్ నిర్మాతలు అందరికీ క్షమాపణలు చెప్పినా ఆ క్షమాపణలు సరిపోవని అన్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇప్పటికే అమెజాన్ ఇండియా ఉన్నతాధికారులతో పాటు ఉత్తరప్రదేశ్ పోలీసులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

తాండవ్ వెబ్ సిరీస్ పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో తాండవ్ మూవీని బహిష్కరించాలని హ్యాష్ ట్యాగ్ లు వైరల్ అవుతున్నాయి.ఈ వివాదానికి తాండవ్ చిత్ర యూనిట్ ఏ విధంగా చెక్ పెడుతుందో చూడాల్సి ఉంది.

#1 Crore Reward #Hindu God's #Slits Tongue #KarnisenaChief #Rs1

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు